మ‌రో ఫిఫా ఆడ‌క‌పోవ‌చ్చు.. మెస్సీ శ‌కం ముగిసిన‌ట్లే!

Published on Mon, 07/20/2026 - 16:23

మెస్సీ ఒక ఉత్పాతం, మౌన ముని. ఎన్ని అడ్డంకులు, వివాదాలు ఎదురైనా త‌న ఆట‌తోనే స‌మాధానం చెప్పాడు త‌ప్ప హ‌ద్దులు మీరిన సంద‌ర్భాలు చాలా త‌క్కువ‌. నిజానికి మెస్సీకి కోపం కూడా ఎక్కువే. కానీ దాని అవ‌స‌రం ఎంత‌మేర ఉంటుందో అంతే చూపిస్తుంటాడు. కాబ‌ట్టే ఇవాళ ప్ర‌పంచంలో ప్ర‌తీ మూల‌న అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. గ‌తంలో ఫుట్‌బాల్ పీలే, మార‌డోనా స‌హా ఎంద‌రో దిగ్గ‌జ ఆట‌గాళ్ల‌ను అందించినప్ప‌టికీ ఈ త‌రంలో మాత్రం మెస్సీనే దిగ్గ‌జ ఆట‌గాడు. ఇంకా చెప్పాలంటే అత‌డో ఆరాధ్య దైవం.

అలాంటి ఈ త‌రంలో ఫుట్‌బాల్ తెలిసినోడిని నిద్ర‌లో నుంచి లేపి ఒక ఆట‌గాడి పేరు చెప్ప‌మంటే మొద‌ట వినిపించే పేరు లియోన‌ల్ మెస్సీ. రెండు ద‌శాబ్దాలుగా త‌న ఆట‌తో ఫుట్‌బాల్ అభిమానుల గుండెల్లో గుడి క‌ట్టేసుకున్న మెస్సీ చూడాల్సిన‌వన్నీ చూశాడు. ఎనిమిది సార్లు బాల‌న్ డీ ఓర్ అవార్డు, ఆరుసార్లు యూరోపియ‌న్ గోల్డెన్ షేస్‌, ఎనిమిది సార్లు ఫిఫా బెస్ట్ ప్లేయ‌ర్‌, అలాగే 2025లో ఆల్‌టైమ్ బెస్ట్ ప్లేయ‌ర్‌గాను నిలిచాడు. త‌న కెరీర్‌లో లోటుగా ఉన్న ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌ను కూడా నాలుగేళ్ల కింద‌ట ఖ‌తార్‌లోనే  అందుకున్నాడు. మ‌రి ఇన్ని చూసినా ఈసారి ఫిఫాలో కూడా మెస్సీ నామ‌జ‌ప‌మే ఎందుకు న‌డిచిందనే ప్ర‌శ్న‌కు మాత్రం స‌మాధానం ఉండ‌దు. అదంతా మెస్సీ మాయ.

Photo Credit: FIFA Twitter

మెస్సీ బ‌రిలో ఉన్నాడంటే చాలు అభిమానుల‌కు ఎక్క‌డ‌లేని జోష్ వ‌స్తుంది. 2026 ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లోనూ అదే రిపీట్ అయింది. ఈసారి ఫిఫాలో డిఫెండింగ్ చాంపియ‌న్‌గా బ‌రిలోకి దిగిన అర్జెంటీనాను మెస్సీనే మ‌రోసారి అన్నీ తానై న‌డిపించాడు. ఆడిన ప్ర‌తీ మ్యాచ్‌లో (ప్రి-క్వార్ట‌ర్ ఫైన‌ల్ వ‌ర‌కు) క‌నీసం ఒక్క గోల్ అయినా కొట్టిన మెస్సీ గోల్డెన్ బూట్ రేసులోను దూసుకెళ్లాడు. 

అయితే అత‌డి స్పీడుకు ఈసారి ఫ్రాన్స్ స్టార్ ఎంబాపె (10 గోల్స్‌, 4 అసిస్ట్‌లు) బ్రేకులు వేశాడు. అయితే క్వార్ట‌ర్స్‌, సెమీస్‌లో గోల్ చేయ‌న‌ప్ప‌టికీ కీల‌క అసిస్ట్‌లు అందించి జ‌ట్టు వెన్నంటే ఉన్నాడు. కానీ కీల‌క‌మైన ఫైన‌ల్లో మెస్సీ ఏం చేయ‌లేక‌పోయాడు. దుర్బేద్య‌మైన స్పెయిన్ ఫార్వార్డ్ ప్లేయ‌ర్ల‌ను అడ్డుకోవ‌డంతోనే మెస్సీకి స‌రిపోయింది. 

మ్యాచ్‌లో మెస్సీ రెండు క్రాస్‌ల‌తో పాటు ఒక్క‌సారి మాత్ర‌మే గోల్‌పోస్ట్ వైపు షాట్ ఆడిన‌ప్ప‌టికీ స్పెయిన్ గోల్ కీప‌ర్ ఉనైయి సిమోన్ దానిని కూడా స‌మ‌ర్థంగా అడ్డుకున్నాడు. మ్యాచ్‌లో స్పెయిన్ 20 సార్లు త‌మ ప్ర‌త్య‌ర్థి గోల్‌పోస్ట్‌పై దాడులు చేస్తే.. అర్జెంటీనా మాత్రం రెండుసార్లు మాత్ర‌మే ప్ర‌య‌త్నం చేయ‌డం గ‌మ‌నార్హం.

Photo Credit: FIFA Twitter
ఇక మ్యాచ్ ముగిసిన త‌ర్వాత మెస్సీ క‌న్నీటిప‌ర్యంత‌మ‌వ‌డం వెనుక ఒక కార‌ణ‌ముంది. ఈసారి ఫిఫా ఆరంభం నుంచి అర్జెంటీనా ఆట‌పై వివాదాలు నెల‌కొన్న‌ప్ప‌టికీ మెస్సీ మాత్రం త‌న ఆట‌ను  చాలా సంద‌ర్భాల్లో నిజాయితీగానే ఆడాడు. ఫైన‌ల్లో కూడా త‌ను చేయాల్సిందంతా చేశాడు. కానీ ప‌క్కా ప్ర‌ణాళిక‌తో బ‌రిలోకి దిగిన స్పెయిన్ ముందు అర్జెంటీనా పూర్తిగా తేలిపోవ‌డంతో మెస్సీ కూడా చేష్టలుడిగి ఉండిపోయాడు.

ఇక 1962 త‌ర్వాత వ‌రుస‌గా రెండు ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లు గెల‌వాల‌న్న క‌ల కూడా చెద‌ర‌డం మెస్సీ క‌న్నీటికి మ‌రో కార‌ణం. 39 ఏళ్ల వ‌య‌సులోనూ కుర్రాళ్ల‌తో పోటీ ప‌డుతూ ఆట‌ను కొన‌సాగించిన మెస్సీ మ‌రో ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ ఆడ‌డం అనుమాన‌మే. మంచి ఫామ్‌లో ఉన్నందున‌ ఈసారి ఎలాగైనా అర్జెంటీనాకు రెండోసారి ఫిఫా టైటిల్‌ను అందించాల‌ని  మెస్సీ క‌లగ‌న్నాడు. బ‌రిలోకి దిగిందే త‌డవుగా ప్ర‌త్య‌ర్థుల‌తో పోరాట సింహంలా త‌ల‌ప‌డ్డాడు. 8 గోల్స్‌తో పాటు 4 అసిస్ట్‌లు చేసిన మెస్సీ సిల్వర్‌ బూట్‌ను కూడా గెలుచుకున్నాడు. 

Photo Credit: FIFA Twitter

అవార్డులు కొత్త కాన‌ప్ప‌టికీ ఈసారి మెస్సీ ఫిఫా టైటిల్‌ను గెలిచిన మ‌రుక్ష‌ణ‌మే ఆట‌కు వీడ్కోలు ప‌లికేవాడేమో. ప్ర‌స్తుతం త‌న రిటైర్మెంట్‌పై మౌన‌మే వ‌హించిన‌ప్ప‌టికీ 2030 ఫిఫాలో మెస్సీ ఆడ‌డం డౌటే. కాబ‌ట్టి ఫుట్‌బాల్‌లో ఒక శ‌కం దాదాపు ముగిసిన‌ట్లే.

 

 

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)