Breaking News

వేలంలో రూ. 25.20 కోట్లు.. చేతికి రూ. 18 కోట్లు మాత్రమే!

Published on Wed, 12/17/2025 - 16:03

భారత క్రికెట్‌ వర్గాల్లో ప్రస్తుతం ముగ్గురు ఆటగాళ్ల గురించి ప్రధానంగా చర్చ నడుస్తోంది. వీరిలో ఒకరు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2026 మినీ వేలంలో అత్యధిక ధర పలికిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌ (Cameron Green).. మరో ఇద్దరు దేశీ అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు కార్తీక్‌ శర్మ (Kartik Sharma), ప్రశాంత్‌ వీర్‌ (Prashant Veer).

రాజస్తాన్‌కు చెందిన పందొమిదేళ్ల కార్తీక్‌ శర్మను, ఉత్తరప్రదేశ్ ఆటగాడు ప్రశాంత్‌ వీర్‌లకు చెన్నై సూపర్‌ కింగ్స్‌‌ కోట్లాభిషేకం చేసింది. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా సేవలు అందించే కార్తీక్‌ కోసం రూ. 14.20 కోట్లు.. బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ ప్రశాంత్‌ వీర్‌ కోసం కూడా అంతే మొత్తం చెన్నై వెచ్చించింది. 

అత్యధిక ధర
ఇక ఈసారి మినీ వేలంలో టాప్‌లో నిలిచిన గ్రీన్‌ను.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఏకంగా రూ. 25.20 కోట్లు ఖర్చు చేసి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా అతడు నిలిచాడు. అయితే, కోల్‌కతా వెచ్చించిన రూ. 25.20 కోట్ల మొత్తం అతడు అందుకోలేడు. వేలంలో ఈ మేర భారీ ధర పలికినా.. గ్రీన్‌కు గరిష్టంగా రూ.18 కోట్లు మాత్రమే లభిస్తాయి.

కారణం ఇదే
ఐపీఎల్‌ నిబంధనల ప్రకారం మినీ వేలంలో విదేశీ ఆటగాడికి ఎంత విలువ పలికినా... ఆటగాళ్ల గరిష్ట రీటెయినింగ్‌ ఫీజు (రూ.18 కోట్లు) లేదా.. మెగా వేలంలో ఆటగాడికి దక్కిన మొత్తం (రూ.27 కోట్లు; రిషభ్‌ పంత్‌)కు ఇది మించరాదు. రెండింటిలో ఏది తక్కువైతే అంతే మొత్తం.. సదరు ఆటగాడికి లభిస్తుంది.

ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ అయిన కామెరాన్‌ గ్రీన్‌కు ఈ నిబంధన వర్తిస్తుంది. కాబట్టి రీటెయింగ్‌ ఫీజుకు సమానంగా అతడికి రూ. 18 కోట్లు దక్కుతాయి. కేకేఆర్‌ అతడి కోసం పర్సు నుంచి తీసిన మొత్తంలో.. మిగిలిన రూ.7.20 కోట్లు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆటగాళ్ల సంక్షేమ నిధికి చేరతాయి. 

అత్యధిక పర్సు వాల్యూతో..
కాగా ఈసారి అత్యధిక పర్సు వాల్యూ రూ. 64.3 కోట్లతో వేలం బరిలో దిగింది కోల్‌కతా. విధ్వంసకర ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ రిటైర్మెంట్‌ కారణంగా అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు వీలుగా గ్రీన్‌ కోసం రికార్డు స్థాయిలో ఖర్చు చేసింది. అదే విధంగా శ్రీలంక యువ పేసర్‌ మతీశ పతిరణ కోసం రూ. 18 కోట్లు, బంగ్లాదేశ్‌ పేసర్‌ ముస్తఫిజుర్‌ రెహ్మాన్‌ కోసం రూ. 9.20 కోట్లు వెచ్చించింది.

వీరితో పాటు తేజస్వి సింగ్‌ (రూ.3 కోట్లు), రచిన్‌ రవీంద్ర (రూ.2 కోట్లు), ఫిన్‌ అలెన్‌ (రూ.2 కోట్లు), సీఫెర్ట్‌ (రూ.1.50 కోట్లు), ఆకాశ్‌దీప్‌ (రూ.1 కోటి), రాహుల్‌ త్రిపాఠి (రూ. 75 లక్షలు), దక్ష్‌ కామ్రా (రూ.30 లక్షలు), సార్థక్‌ రంజన్‌ (రూ.30 లక్షలు), ప్రశాంత్‌ సోలంకి (రూ.30 లక్షలు), కార్తీక్‌ త్యాగి (రూ.30 లక్షలు)లను వేలంలో కొనుగోలు చేసింది.

ఐపీఎల్‌-2026కు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు ఇదే
అజింక్య రహానే, రోవ్‌మన్‌ పావెల్‌, అంగ్‌క్రిష్‌ రఘువన్షి, సునిల్‌ నరైన్‌, అనుకుల్‌ రాయ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, హర్షిత్‌ రాణా, వైభవ్‌ అరోరా, మనీశ్‌ పాండే, వరుణ్‌ చక్రవర్తి, రమణ్‌దీప్‌ సింగ్‌, రింకూ సింగ్‌ కామెరాన్‌ గ్రీన్‌, మతీశ పతిరణ, ముస్తఫిజుర్‌ రెహ్మాన్‌, తేజస్వి సింగ్‌ , రచిన్‌ రవీంద్ర, ఫిన్‌ అలెన్‌ , సీఫెర్ట్‌, ఆకాశ్‌దీప్‌, రాహుల్‌ త్రిపాఠి , కామ్రా , సార్థక్‌ రంజన్‌ , ప్రశాంత్‌ సోలంకి, కార్తీక్‌ త్యాగి.

చదవండి: IPL 2026: కనక వర్షం.. ‘మినీ’ వేలంలో ఎవరికి ఎంత? పది జట్ల వివరాలు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)