Breaking News

WTC Final 2021-23: కోహ్లి వర్సెస్‌ గిల్‌..?

Published on Sat, 06/03/2023 - 15:00

భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఓవల్‌ మైదానం వేదికగా జూన్‌ 7 నుంచి 11 వరకు జరుగనున్న వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2021-23 ఫైనల్లో ఏ ఆటగాడు టాప్‌ స్కోరర్‌గా నిలుస్తాడన్న డిస్కషన్‌ ఇప్పటి నుంచే మొదలైంది. ఇరు జట్ల బ్యాటింగ్‌ బలాబలాలు సమతూకంగా ఉండటంతో ఎవరు అధిక పరుగులు చేస్తారని చెప్పడం కాస్త కష్టమైన పనే అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

కొందరు విరాట్‌ కోహ్లి, శుభ్‌మన్‌ గిల్‌, పుజారాల పేర్లు చెబుతుంటే.. మరి కొందరు స్టీవ్‌ స్మిత్‌, లబూషేన్‌, ట్రవిస్‌ హెడ్‌లలో ఎవరో ఒకరు టాప్‌ స్కోరర్‌గా నిలుస్తారని అభిప్రాయపడుతున్నారు. అంచనాలు, అభిప్రాయాలు పక్కన పెట్టి, ఇరు జట్ల ఆటగాళ్ల తాజా ఫామ్‌ను పరిగణలోకి తీసుకుని పరిశీలిస్తే.. శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లిలలో ఎవరో ఒకరు టాప్‌ స్కోరర్‌గా నిలుస్తారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.

తాజాగా ముగిసిన ఐపీఎల్‌ సీజన్‌లో వీరిద్దరు భీకర ఫామ్‌లో ఉండి పరుగులు వరద పారించారు. గిల్‌ 17 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు సాయంతో 890 పరుగులు చేయగా.. కోహ్లి 14 మ్యాచ్‌ల్లో 2 సెంచరీల సాయంతో 639 పరుగులు చేశాడు. వీరిద్దరు ఇదే ఫామ్‌ను డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ కొనసాగిస్తే, సెంచరీల మోత మోగి పరుగుల వరద పారడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వీరిద్దరే కాక టీమిండియాలోనే మరో ఇద్దరికి కూడా డబ్ల్యూటీసీ ఫైనల్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచే అవకాశం ఉంది. ఇంగ్లండ్‌ పరిస్థితులకు అతికినట్లు సరిపోయే   పుజారా, ఓవల్‌ మైదానంలో మంచి ట్రాక్‌ రికార్డు (గత మ్యాచ్‌లో సెంచరీ) కలిగిన రోహిత్‌ శర్మకు కూడా అధిక పరుగులు చేసే అవకాశం ఉంది. మరోవైపు ఆసీస్‌ బ్యాటర్ల అవకాశాలను కూడా తీసి పారేయడానికి వీలు లేదు. స్టీవ్‌ స్మిత్‌, మార్నస్‌ లబూషేన్‌, ట్రవిస్‌ హెడ్‌, డేవిడ్‌ వార్నర్‌లలో ఎవరో ఒకరు టాప్‌ స్కోరర్‌గా నిలువవచ్చు. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా, డబ్ల్యూటీసీ ఫైనల్లో ఎవరు రాణిస్తారో తేలాలంటే మరో నాలుగు రోజులు వేచి చూడాల్సిందే. 

చదవండి: ఫైనల్‌లో టీమిండియా గెలిస్తే.. ప్రపంచ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర!

Videos

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)