Breaking News

టీమిండియాకు కొత్త కోచ్‌.. ఎవరీ శుభదీప్ ఘోష్?

Published on Wed, 07/29/2026 - 09:01

భారత సీనియర్‌ క్రికెట్‌ జట్టు అసిస్టెంట్‌ కోచ్‌ ర్యాన్‌ టెన్‌ డస్కటే, ఫీల్డింగ్‌ కోచ్‌ టి. దిలీప్‌ కాంట్రాక్ట్‌ ముగిసింది. ఈ ఇద్దరికీ ఎలాంటి పొడిగింపు ఇవ్వడంలేదని బోర్డు కార్యదర్శి దేవజిత్‌ సైకియా మంగళవారం వెల్లడించారు. టెన్‌ డస్కటే తిరిగి ఐపీఎల్‌ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌)తో జతకట్టనున్న‌ట్లు స‌మాచారం. 

కోల్‌కతా జట్టుతో డస్కటేకు సుదీర్ఘ అనుబంధం ఉంది. 2012, 2014లో ఐపీఎల్‌ టైటిల్స్‌ గెలిచిన కేకేఆర్‌ జట్టులో ప్లేయర్‌గా ఉన్న అతడు... 2022 నుంచి 2024 వరకు ఆ జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌గా పనిచేశాడు. అదే సమయంలో గంభీర్‌ కేకేఆర్‌ మెంటార్‌గా పనిచేయడంతో ఆ తర్వాత భారత జట్టు శిక్షణ బృందంలో సైతం అతడికి చోటు దక్కింది. 

టీమిండియా చాంపియన్స్‌ ట్రోఫీ, ఆసియా కప్, టి20 ప్రపంచకప్‌ గెలిచిన సమయంలో డస్కటే భారత కోచింగ్‌ స్టాఫ్‌లో భాగంగా ఉన్నాడు. అయితే రెండేళ్లుగా టీమిండియాతో కలిసి పనిచేసినప్పటికీ అతడికి నిర్దిష్టమైన బాధ్యతలు అప్పగించలేదు. ఈ క్రమంలోనే బోర్డు అతడి కాంట్రాక్ట్‌ను పొడిగించలేదు.

కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా శుభదీప్ 
ఇక దిలీప్ స్ధానంలో కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా మాజీ దేశ‌వాళీ క్రికెట‌ర్ శుభదీప్ ఘోష్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. శుభదీప్‌నకు కోచ్‌గా అపార‌మైన అనుభ‌వం ఉంది. అత‌డు డొమాస్టిక్ క్రికెట్‌లో అస్సాం, రైల్వేస్ జ‌ట్ల‌కు ప్రాతినిథ్యం వ‌హించాడు.  ఆల్‌రౌండ‌ర్ అయిన ఘోష్  ఫస్ట్-క్లాస్, లిస్ట్-ఎ క్రికెట్ రెండింటిలోనూ చెరో 17 మ్యాచ్‌లు ఆడాడు.

ఘోష్ తన చివరి ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ను 2004లో ఆడగా, తర్వాతి ఏడాది తన లిస్ట్-ఎ కెరీర్‌కు ముగింపు పలికాడు. అనంత‌రం కోచ్‌గా త‌న ప్ర‌య‌ణాన్ని ప్రారంభించాడు. శుభదీప్ ఘోష్ గత 15 ఏళ్లుగా నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) కోచింగ్ విభాగంలో కీలక సభ్యుడిగా పనిచేస్తున్నారు. 2021లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత మహిళల జాతీయ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా ఘోష్ వ్యవహరించాడు.

అంతేకాకుండా అండర్‌-19 ప్రపంచకప్‌(20244)లో భారత యువ జట్టుకు కూడా ఫీల్డింగ్ కోచ్‌గా అతడు సేవలు అందించారు. పలు పర్యటనలలో భారత్‌-ఎ జట్టు కోచింగ్ స్టాప్‌లో సైతం అతడు భాగమయ్యాడు. ఐపీఎల్‌-2014 సీజన్‌లో విజేతగా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఫీల్డింగ్ కోచ్‌గా కూడా ఘోష్ పనిచేశాడు.

కాగా గత కొంతకాలంగా భారత సీనియర్ జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. ఇప్పుడు అనుభవజ్ఞుడైన ఘోష్ రాకతో టీమిండియా ఫీల్డింగ్‌లో పూర్వ వైభవం సాధిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
చదవండి: CG 2026: వర్షంలోనూ తగ్గని జోరు.. ఆఖరి క్షణాల్లో అద్భుతం
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)