Breaking News

సిరీస్‌ డిసైడర్‌.. ఆరంభం అదిరినా, ఆఖర్లో తడబడిన బంగ్లాదేశ్‌

Published on Thu, 10/23/2025 - 16:57

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో ఇవాళ (అక్టోబర్‌ 23) జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో (Bangladesh vs West Indies) బంగ్లాదేశ్‌ ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. 

ఓపెనర్లు సైఫ్‌ హసన్‌ (80), సౌమ్య సర్కార్‌ (91) సెంచరీలకు చేరువగా వచ్చి ఔటయ్యారు. మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్‌ చేసిన తౌహిద్‌ హృదోయ్‌ (28), నజ్ముల్‌ హసన్‌ షాంటో (44) కూడా పర్వాలేదనిపించారు. అయితే ఆతర్వాత వచ్చిన వారు పెద్దగా రాణించకపోవడంతో బంగ్లాదేశ్‌ భారీ స్కోర్‌ చేయలేకపోయింది. 

ఓ దశలో సునాయాసంగా 350 పరుగులు చేస్తుందనుకున్న జట్టు మిడిలార్డర్‌ వైఫల్యం కారణంగా 300లోపే పరిమితమైంది. మిడిలార్డర్‌ బ్యాటర్లు మహిదుల్‌ ఇస్లాం 6, రిషద్‌ హొసేన్‌ 3, నసుమ్‌ అహ్మద్‌ 1 పరుగుకు ఔటయ్యారు. 

ఆఖర్లో నురుల్‌ హసన్‌ (16 నాటౌట్‌), కెప్టెన్‌ మెహిది హసన్‌ (17) ఓ మోస్తరుగా బ్యాట్‌ ఝులిపించడంతో బంగ్లాదేశ్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. 

తొలుత తడబడిన విండీస్‌ బౌలర్లు ఆఖర్లో అనూహ్యంగా పుంజుకొని బంగ్లాను 300లోపే కట్టడి చేశారు. అకీల్‌ హోసేన్‌ 4, అలిక్‌ అథనాజ్‌ 2, రోస్టన్‌ ఛేజ్‌, మోటీ తలో వికెట్‌ తీసి, బంగ్లాను భారీ స్కోర్‌ చేయకుండా నియంత్రించారు.

కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి వన్డేలో బంగ్లాదేశ్‌, రెండో వన్డేలో వెస్టిండీస్‌ (సూపర్‌ ఓవర్‌) గెలిచాయి. ఈ సిరీస్‌ తర్వాత ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కూడా జరుగనుంది. ఈ సిరీస్‌ అక్టోబర్‌ 27, 29, 31 తేదీల్లో చట్టోగ్రామ్‌ వేదికగా జరుగుతుంది. ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం వెస్టిండీస్‌ బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది.

చదవండి: IPL 2026: శ్రేయస్‌ అయ్యర్‌ టీమ్‌లో కీలక చేరిక
 

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు