Breaking News

కివీస్‌పై విండీస్‌ ఆధిపత్యం

Published on Wed, 12/03/2025 - 07:35

క్రైస్‌చర్చ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌లో విండీస్‌ బౌలర్లు చెలరేగిపోయారు. తలో చేయి వేసి కివీస్‌ను స్వల్ప స్కోర్‌కే పరిమితం చేశారు. కీమర్‌ రోచ్‌, సీల్స్‌, షీల్డ్స్‌, గ్రీవ్స్‌ తలో 2.. లేన్‌, ఛేజ్‌ చెరో వికెట్‌ తీసి కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌ను 231 పరుగులకే కుప్పకూల్చారు.

కివీస్‌ ఇన్నింగ్స్‌లో కేన్‌ విలియమ్సన్‌ (52) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు. బ్రేస్‌వెల్‌ (47), బ్లండల్‌ (29), లాథమ్‌ (24), నాథన్‌ స్మిత్‌ (23), యంగ్‌ (14) రెండంకెల​ స్కోర్లు చేయగలిగారు. కాన్వే (0), రచిన్‌ (3), ఫౌల్క్స్‌ (4), హెన్రీ (8) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. ఈ ఇన్నింగ్స్‌లో కివీస్‌పై విండీస్‌ స్పష్టమై ఆధిపత్యం చలాయించింది.

అనంతరం బరిలోకి దిగిన విండీస్‌ బ్యాటింగ్‌లోనూ పర్వాలేదనిపిస్తుంది. 44 ఓవర్ల తర్వాత ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. షాయ్‌ హోప్‌ (56) అర్ద సెంచరీతో రాణించగా.. తేజ్‌నరైన్‌ చంద్రపాల్‌ 38, కెప్టెన్‌ ఛేజ్‌ 0 పరుగుల వద్ద క్రీజ్‌లో ఉన్నారు. 

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు విండీస్‌ ఇంకా 126 పరుగులు వెనుకపడి ఉంది. ప్రస్తుతం రెండో రోజు రెండో సెషన్‌ ఆట కొనసాగుతుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న తొలి టెస్ట్‌ ఇది.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)