Breaking News

న్యూజిలాండ్‌ ‘క్లీన్‌ స్వీప్‌’

Published on Sun, 11/23/2025 - 03:36

హామిల్టన్‌ (న్యూజిలాండ్‌): ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన న్యూజిలాండ్‌ జట్టు... వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. శనివారం జరిగిన మూడో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 4 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తుచేసింది. టి20 సిరీస్‌ను 3–1తో కైవసం చేసుకున్న కివీస్‌... వన్డే సిరీస్‌ను 3–0తో చేజిక్కించుకుంది. ఆఖరి పోరులో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న వెస్టిండీస్‌ 36.2 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. 

రోస్టన్‌ ఛేజ్‌ (51 బంతుల్లో 38; 3 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌ కాగా... జాన్‌ క్యాంప్‌బెల్‌ (26; 3 ఫోర్లు, 1 సిక్స్‌), ఖారీ పియర్‌ (22 నాటౌట్‌; 2 సిక్స్‌లు) తలా కొన్ని పరుగులు చేశారు.  కెపె్టన్‌ షై హోప్‌ (16), అకీమ్‌ అగస్ట్‌ (17), కార్టీ (0), రూథర్‌ఫోర్డ్‌ (19), జస్టిన్‌ గ్రేవ్స్‌ (1) విఫలమయ్యారు. న్యూజిలాండ్‌ బౌలర్ల ధాటికి కరీబియన్‌ జట్టు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. మ్యాట్‌ హెన్రీ 43 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. జాకబ్‌ డఫీ, మిచెల్‌ సాంట్నర్‌ చెరో 2 వికెట్లు తీశారు. 

అనంతరం లక్ష్యఛేదనలో న్యూజిలాండ్‌ 30.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. మార్క్‌ చాప్‌మన్‌ (63 బంతుల్లో 64; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) చక్కటి హాఫ్‌సెంచరీతో సత్తాచాటగా... మిచెల్‌ బ్రాస్‌వెల్‌ (31 బంతుల్లో 40 నాటౌట్‌; 6 ఫోర్లు) రాణించాడు. ఓపెనర్లు డెవాన్‌ కాన్వే (11), రచిన్‌ రవీంద్ర (14)తో పాటు విల్‌ యంగ్‌ (3), టామ్‌ లాథమ్‌ (10) విఫలమవడంతో ఒక దశలో 70 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన కివీస్‌ జట్టును చాప్‌మన్‌ ఆదుకున్నాడు. 

బ్రాస్‌వెల్‌తో కలిసి జట్టును విజయానికి చేరువ చేశారు. వెస్టిండీస్‌ బౌలర్లలో మాథ్యూ ఫోర్డ్, జైడెన్‌ సీల్స్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. న్యూజిలాండ్‌ ప్లేయర్లు మ్యాట్‌ హెన్రీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’, కైల్‌ జెమీసన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డులు దక్కాయి. ఇరు జట్ల మధ్య డిసెంబర్‌ 2 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)