Breaking News

ఇదేమి ఆటతీరు.. స్వల్ప ఛేదనలో నానా తంటాలు!

Published on Wed, 08/05/2026 - 18:46

సాధార‌ణంగా 100 బంతుల్లో 86 ప‌రుగుల టార్గెట్ అంటే సునాయాసంగా ఊదిపారేయచ్చు. కానీ వెల్ష్ ఫైర్ జ‌ట్టు మాత్రం ఆ చిన్న టార్గెట్‌ను అందుకోవ‌డానికి నానా తంటాలు ప‌డింది. చివ‌ర‌కు ఎలాగోలా 3 వికెట్ల తేడాతో గెలిచి గట్టెక్కింది. హండ్రెడ్ వుమెన్స్ కాంపిటీష‌న్‌లో మాంచెస్ట‌ర్ సూప‌ర్‌జెయింట్స్‌పై వెల్ష్‌ఫైర్ క‌ష్ట‌ప‌డి విజ‌యాన్ని అందుకుంది. 

తొలుత బ్యాటింగ్ చేసిన మాంచెస్ట‌ర్ సూప‌ర్ జెయింట్స్ నిర్ణీత 100 బంతుల్లో 9 వికెట్ల న‌ష్టానికి 85 ప‌రుగులు చేసింది. రియానా మెక్‌డొనాల్డ్ (18),  స్మృతి మంధాన (15) ప‌ర్వాలేద‌నిపించారు. మిగిలిన బ్యాట‌ర్ల‌లో ఎవ‌రు పెద్ద‌గా రాణించ‌లేదు. వెల్ష్ ఫైర్ బౌల‌ర్ల‌లో ఒర్లా ప్రెండెగాస్ట్ 4 వికెట్ల‌తో చెల‌రేగ‌గా, హెథ‌ర్ గ్ర‌హ‌మ్ 2 వికెట్లు ప‌డగొట్టింది. 

అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో వెల్ష్‌పైర్ కూడా పూర్తిగా త‌డ‌బ‌డిన‌ప్ప‌టికీ మ‌రో 9 బంతులు మిగిలి ఉండ‌గా 7 వికెట్లు కోల్పోయి విజ‌యాన్ని సాధించింది. అయితే ఒక ద‌శ‌లో వ‌రుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన వెల్ష్‌ఫైర్‌ను హెథ‌ర్ గ్రాహం (16 నాటౌట్‌) అజేయంగా నిలిచి జ‌ట్టును గెలిపించింది. ఓపెన‌ర్లు జార్జియా వోల్ (16), సారా బ్రైస్ (16) రాణించారు. మాంచెస్ట‌ర్ బౌల‌ర్ల‌లో సోఫీ ఎసెల్‌స్టోన్ 3 వికెట్లు తీయ‌గా, రెబెక్కా టైస‌న్, మాడీ విల్ల‌ర్స్‌, కేథ‌రిన్ బ్రైస్ త‌లా ఒక వికెట్ తీశారు.

కాగా వెల్ష్‌ఫైర్‌కు ఇది ఆరు మ్యాచ్‌ల్లో మూడో విజ‌యం కాగా, మాంచెస్ట‌ర్ సూప‌ర్‌జెయింట్స్‌కు రెండో ప‌రాజ‌యం. 14 పాయింట్ల‌తో మాంచెస్ట‌ర్ జెయింట్స్ మూడో స్థానంలో ఉండ‌గా, వెల్ష్‌ఫైర్ 12 పాయింట్ల‌తో నాలుగో స్థానంలో  కొన‌సాగుతోంది.

Read: ఇంగ్లండ్ బ్యాటింగ్ కోచ్‌గా ఆసీస్ దిగ్గ‌జం!

Videos

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

ఆసియా గేమ్స్ మహిళల కబడ్డీలో భారత్ కు స్వర్ణం

ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యే... కాకుమానుపై పోలీసుల తీరు.. అడ్వకేట్ రజినీ షాకింగ్ నిజాలు

Photos

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)