Breaking News

ముచ్చల్‌తో నిశ్చితార్థాన్ని ధ్రువీకరించిన మంధన

Published on Thu, 11/20/2025 - 19:45

భారత మహిళా జట్టు స్టార్‌ క్రికెటర్‌, టీమిండియా 'క్వీన్‌' స్మృతి మంధన (Smriti Mandhana) త్వరలో పెళ్లి పీఠలెక్కబోతుందన్న ప్రచారం నిజమైంది. సంగీత దర్శకుడు, సింగర్‌ పాలాష్ ముచ్చల్‌తో (Palash Muchhal) నిశ్చితార్థాన్ని మంధన స్వయంగా ధ్రువీకరించింది. 

ఇన్‌స్టాగ్రామ్‌లో సహచరి జెమిమా రోడ్రిగ్స్ షేర్ చేసిన వీడియోలో మంధన తన చేతి వేలికి ఉన్న డైమండ్ రింగ్‌‌ను చూపిస్తూ మున్నా భాయ్‌ MBBS సినిమాలోని "సమ్జో హో హీ గయా" పాటకు డ్యాన్స్ చేసింది. ఆ వీడియోను మంధన స్వయంగా రీపోస్ట్ చేస్తూ, ముచ్చల్‌తో తన నిశ్చితార్థాన్ని అఫీషియల్‌ చేసింది.  

మంధన-ముచ్చల్‌ 2019లో స్నేహితుల ద్వారా కలుసుకున్నారు. సంగీతం, క్రీడలపై ఆసక్తి వారిని దగ్గర చేసింది. ఐదు సంవత్సరాల డేటింగ్ అనంతరం 2024లో వీరు తమ అనుబంధాన్ని బహిర్గతం చేశారు. ముచ్చల్ తరచూ మంధన ఆడే మ్యాచ్‌లలో కనిపిస్తూ ఆమెకు మద్దతు పలుకుతుంటాడు.  

మంధన-ముచ్చల్‌ వివాహా తేదీపై ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ, సోషల్‌మీడియాలో వీరి పెళ్లికి సంబంధించిన ఓ ఆహ్వాన పత్రిక వైరలవుతుంది. దీని ప్రకారం వీరి పెళ్లి మరికొద్ది రోజుల్లో (నవంబర్ 23న) జరగనుంది. ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌, సాంగ్లీల్లో జరుగనున్నట్లు తెలుస్తుంది. 

ఇందుకు సన్నాహకాలు కూడా పూర్తయ్యాయని సమాచారం​. మంధన ఇటీవలే భారత్‌ను వన్డే ప్రపంచ ఛాంపియన్‌గా నిలబెట్టడంతో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. జగజ్జేతగా నిలిచిన కొద్ది రోజుల్లోనే మంధన జీవితంలో మరో పెద్ద విజయోత్సవం జరగడం ఖాయమైంది. మంధన-ముచ్చల్‌ వివాహాం క్రికెట్‌తో పాటు సంగీత అభిమానుల్లోనే ఆనందాన్ని నింపనుంది. 

చదవండి: కెప్టెన్‌గా ఇషాన్‌ కిషన్‌ పేరు ప్రకటన

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)