Breaking News

అలాంటి పని అస్సలు చేయను: కుండబద్దలు కొట్టిన గంభీర్‌

Published on Mon, 11/10/2025 - 18:42

టీమిండియా హెడ్‌కోచ్‌, భారత మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ (Gautam Gambhir)కు ముక్కుసూటిగా మాట్లాడటం అలవాటు. దీనికి తోడు దూకుడు స్వభావం కారణంగా ఎన్నోసార్లు విమర్శలు మూటగట్టుకున్నాడు గౌతీ. అయినా.. కూడా తగ్గేదేలే అంటూ అలాగే ముందుకు సాగుతున్నాడు. అతడి తాజా వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.

ఇటీవల గౌతీ మార్గదర్శనంలో ఆస్ట్రేలియా పర్యటన (IND vs AUS)లో వన్డే సిరీస్‌ను టీమిండియా 1-2తో కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌కు ముందు వన్డే కెప్టెన్‌గా దిగ్గజ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma)ను తప్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న యాజమాన్యం.. టెస్టు సారథి శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill)కే వన్డే పగ్గాలూ అప్పగించింది.

చేదు అనుభవం 
ఇక వన్డే కెప్టెన్‌గా ఆసీస్‌ రూపంలో తొలి ప్రయత్నంలోనే కఠిన సవాలు ఎదుర్కొన్న గిల్‌.. ఇటు బ్యాటర్‌గా.. అటు కెప్టెన్‌గా చేదు అనుభవం చవిచూశాడు. తొలి రెండు వన్డేల్లో ఓడి భారత్‌ ముందుగానే సిరీస్‌ కోల్పోగా.. ఆఖరిదైన నామమాత్రపు మూడో వన్డేలో మాత్రం గెలిచి క్లీన్‌స్వీప్‌ నుంచి తప్పించుకుంది.

‘రో-కో’దే కీలక పాత్ర
ఈ విజయంలో రీఎంట్రీ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిదే కీలక పాత్ర. రోహిత్‌ అజేయ శతకం (121)తో దుమ్ములేపగా.. కోహ్లి 74 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరి విజృంభణ కారణంగా ఆసీస్‌ విధించిన 236 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం ఒక్క వికెట్‌ కోల్పోయి ఛేదించింది.

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో ఓటమి పట్ల గౌతం గంభీర్‌ తాజాగా స్పందించాడు. బీసీసీఐ టీవీతో మాట్లాడుతూ.. సిరీస్‌ ఓడిపోవడం ఎంతమాత్రం ఉపేక్షించదగింది కాదని.. తాను అందుకే మూడో వన్డే గెలుపు సెలబ్రేట్‌ చేసుకోలేదంటూ కుండబద్దలు కొట్టాడు.

వాటిని పట్టించుకోను
‘‘వ్యక్తిగత ప్రదర్శనలను నేనెప్పుడూ పట్టించుకోను. అయితే, వారి ప్రదర్శన పట్ల సంతోషంగా ఉంటాను. ఏదేమైనా అంతిమంగా మనం సిరీస్‌ ఓడిపోయాం.

అన్నింటికంటే అదే అతి ముఖ్యమైన విషయం. కోచ్‌గా నేను ఇలాంటి వాటిని ఎప్పుడూ సెలబ్రేట్‌ చేసుకోను. ఓ ఆటగాడిగా.. వ్యక్తిగత ప్రదర్శనలను అభినందిస్తా. కానీ కోచ్‌గా ఇలాంటివి జీర్ణించుకోలేను.

కోచ్‌గా అలాంటి పని ఎప్పటికీ చేయను
దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నపుడు ఆటగాళ్లైనా, కోచ్‌ అయినా ఇలాంటి ఘోర ఓటమి తర్వాత వచ్చిన విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకోవడం సరికాదు కూడా!.. ఏదేమైనా మేము ఆస్ట్రేలియాలో టీ20 సిరీస్‌ గెలిచాం. 

ఇదొక భిన్నమైన ఫార్మాట్‌. అయితే, ఈ సిరీస్‌లో సానుకూల అంశాలతో పాటు నేర్చుకోవాల్సిన గుణపాఠాలు కూడా ఉన్నాయి’’ అని గంభీర్‌ తన మనసులోని భావాలను కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పాడు.

కాగా ఆసీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో.. మొదటి. ఆఖరి మ్యాచ్‌లు వర్షం వల్ల రద్దు అయ్యాయి. అయితే, రెండో టీ20లో ఓడిన సూర్యకుమార్‌ సేన వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ కైవసం చేసుకుంది.

చదవండి: వన్డే ఆల్‌టైమ్‌ జట్టు.. టీమిండియా నుంచి ముగ్గురు.. రోహిత్‌కు దక్కని చోటు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)