Pak Vs Aus: మాకిది అలవాటే! పాక్‌పై ధావన్‌ సెటైర్లు.. వీడియో వైరల్‌

Published on Tue, 10/03/2023 - 20:40

ICC Cricket World Cup Warm-up Matches 2023- Pakistan vs Australia: పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టుపై టీమిండియా వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. పాకిస్తాన్‌- ఫీల్డింగ్‌.. ఈ జంట ప్రేమకథ ఎప్పటికీ ముగిసిపోదంటూ సెటైర్లు వేశాడు. వన్డే వరల్డ్‌కప్‌-2023 నేపథ్యంలో బాబర్‌ ఆజం బృందం ఇప్పటికే భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో హైదరాబాద్‌లో సన్నాహక మ్యాచ్‌లు ఆడుతోంది. ఇందులో భాగంగా న్యూజిలాండ్‌తో తొలి వార్మప్‌ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఓడిన పాక్‌.. మంగళవారం(అక్టోబరు 3) ఆస్ట్రేలియాతో తలపడుతోంది.

ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆసీస్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (77), కామెరాన్‌ గ్రీన్‌(50- నాటౌట్‌) హాఫ్‌ సెంచరీలతో చెలరేగడం సహా మిగతా బ్యాటర్లలో అలెక్స్‌ క్యారీ మినహా మిగతా వాళ్లంతా రాణించారు.

మిస్‌ఫీల్డింగ్‌.. వీడియో వైరల్‌
ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 351 పరుగుల భారీ స్కోరు చేసింది కంగారూ జట్టు. పాక్‌ బౌలర్ల, ఫీల్డర్ల తప్పిదాలను క్యాష్‌ చేసుకుని పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ క్రమంలో ఆసీస్‌తో మ్యాచ్‌లో పాక్‌ ఫీల్డర్లు మహ్మద్‌ వాసిం జూనియర్‌, మహ్మద్‌ నవాజ్‌ సమన్వయలోపంతో ఎక్స్‌ట్రా పరుగులు ఇవ్వడం ఆ జట్టు అభిమానులకు చిరాకు తెప్పించింది.

పాకిస్తాన్‌- ఫీల్డింగ్‌.. నెవర్‌ ఎండింగ్‌ లవ్‌స్టోరీ
ఇందుకు సంబంధించిన వీడియోను హైలైట్‌ చేస్తూ.. ‘‘పాకిస్తాన్‌- ఫీల్డింగ్‌.. నెవర్‌ ఎండింగ్‌ లవ్‌స్టోరీ’’ అంటూ ధావన్‌ ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ పెట్టాడు. గబ్బర్‌ కామెంట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. లైకులు, షేర్లతో దూసుకుపోతోంది. కాగా పాక్‌ టీమ్‌కు ఇలాంటివి కొత్తేం కాదు. మిస్‌ఫీల్డింగ్‌ కారణంగా ఆ జట్టు భారీ మూల్యం చెల్లించిన సందర్భాలెన్నో ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్‌కప్‌-2023 భారత జట్టులో శిఖర్‌ ధావన్‌కు చోటు దక్కలేదన్న విషయం తెలిసిందే. శుబ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌ వంటి యువకులతో పోటీలో ఈ వెటరన్‌ ఓపెనర్‌ వెనుబడిపోయాడు. ఇక అక్టోబరు 5 నుంచి భారత్‌ వేదికగా ఈ మెగా టోర్నీ ఆరంభం కానుండగా.. టీమిండియా అక్టోబరు 8న తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఆస్ట్రేలియాతో చెన్నైలో పోటీ పడనుంది. ఇక అక్టోబరు 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది.

చదవండి: 1987లో జన్మించిన కెప్టెన్‌దే ఈసారి వరల్డ్‌కప్‌ ట్రోఫీ! లిస్టులో ఎవరంటే!

Videos

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)