Breaking News

ఒక్క చూపు సోషల్‌ మీడియాను షేక్‌ చేసింది..

Published on Fri, 01/20/2023 - 15:02

లియోనల్‌ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో.. ఫుట్‌బాల్‌లో ఎవరికి వారే సాటి. అయితే మెస్సీ ఇటీవలే అర్జెంటీనాకు ఫిఫా వరల్డ్‌కప్‌ అందించి రొనాల్డో కంటే ఒక మెట్టు పైనే ఉ‍న్నాడు. మరో వరల్డ్‌కప్‌ జరిగేందుకు నాలుగేళ్ల సమయం ఉంది. వచ్చే వరల్డ్‌కప్‌లో ఈ ఇద్దరు ఆడుతారా లేదా అనేది ఆసక్తికరమే.  ఈ విషయం పక్కనబెడితే.. మెస్సీ, రొనాల్డోలు ఒకే ఫుట్‌బాల్‌ క్లబ్‌కు ఆడిన సందర్భాలకంటే ప్రత్యర్థులుగా తలపడిన సందర్భమే ప్రేక్షకులకు ఎక్కువ మజాను అందిస్తుంది.

తాజాగా ఫిఫా వరల్డ్‌కప్‌ ముగిసిన తర్వాత ఈ ఇద్దరు ప్రత్యర్థులుగా మరోసారి తలపడ్డారు. దీనికి ఒక ఫ్రెండ్లీ మ్యాచ్‌ వేదికైంది. ఇటీవలే వివాదాస్పద రీతిలో మాంచెస్టర్‌ యునైటెడ్‌ను వీడిన క్రిస్టియానో రొనాల్డో.. సౌదీ అరేబియా ఫుట్‌బాల్‌ క్లబ్‌ అయిన అల్‌-నసర్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇక మెస్సీ, నెయ్‌మర్‌, కైలియన్‌ ఎంబాపెలు పారిస్‌ సెయింట్స్‌ జర్మన్‌(పీఎస్‌జీ)కి ఆడుతున్నారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్‌ ఫహద్‌ స్టేడియం వేదికగా మ్యాచ్‌ జరిగింది. మ్యాచ్‌లో మెస్సీ నేతృత్వంలోని ఆల్‌స్టార్స్‌ ఎలెవన్‌ జట్టు 5-4తో గెలుపొందింది. 

కాగా మ్యాచ్‌ మధ్యలో మెస్సీ రొనాల్డోవైపు ఒక లుక్‌ ఇచ్చాడు. కానీ రొనాల్డో మాత్రం మెస్సీని పట్టించుకోనట్లుగానే వ్యవహరించాడు.   ఆ సమయంలో మెస్సీ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మెస్సీ ఇచ్చిన ఒక్క చూపు సోషల్‌ మీడియాను షేక్‌ చేసింది. అయితే ఇదంతా కేవలం కామెడీ కోసం మాత్రమే అని తర్వాత అర్థమైంది. మ్యాచ్‌ ముగిసిన అనంతరం ఇద్దరు ఒకరినొకరు హగ్‌ చేసుకున్న వీడియో బయటికి వచ్చింది.ఇక మ్యాచ్‌ ముగిసిన అనంతరం రొనాల్డో సోషల్‌ మీడియా వేదికగా ఒక పోస్టు పెట్టాడు. ''కొంత మంది పాత స్నేహితులను కలుసుకోవడం సంతోషంగా అనిపించింది.'' అంటూ కామెంట్‌ చేశాడు.

చదవండి: 24 ఏళ్లపాటు కోమాలోనే.. కన్నుమూసిన సైక్లిస్ట్‌

బోల్ట్‌కు చేదు అనుభవం.. అకౌంట్‌ నుంచి 97 కోట్లు మాయం

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)