Breaking News

భవిష్యత్‌ ఆశాకిరణం.. అతడిని బెంచ్‌కే పరిమితం చేయండి: పాక్‌ మాజీ క్రికెటర్‌

Published on Sat, 09/27/2025 - 15:12

టీమిండియా చేతిలో రెండుసార్లు ఓడిపోయినప్పటికీ పాకిస్తాన్‌ ఎట్టకేలకు ఆసియా కప్‌-2025 టోర్నమెంట్‌ ఫైనల్‌కు చేరుకుది. సూపర్‌-4లో బంగ్లాదేశ్‌, శ్రీలంక జట్లపై విజయం సాధించడం ద్వారా టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. మరోవైపు.. భారత్‌ లీగ్‌, సూపర్‌-4 దశలో పరాజయమన్నదే లేకుండా ఫైనల్లో పాక్‌ (IND vs PAK)తో తలపడేందుకు సిద్ధమైంది.

అయితే, ఈ టోర్నీలో పాకిస్తాన్‌ బౌలింగ్‌ పరంగా ఫర్వాలేదనిపించినా.. బ్యాటింగ్‌లో మాత్రం తడబడుతోంది. ముఖ్యంగా భారీ అంచనాలతో బరిలోకి దిగిన యువ ఓపెనర్‌ సయీమ్‌ ఆయుబ్‌ (Saim Ayub) దారుణంగా విఫలమవుతున్నాడు.

హ్యాట్రిక్‌ డకౌట్లు
ఒమన్‌తో మ్యాచ్‌లో గోల్డెన్‌ డకౌట్‌ అయిన సయీమ్‌ ఆయుబ్‌.. టీమిండియా, యూఏఈతో మ్యాచ్‌లలోనూ పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. ఇలా హ్యాట్రిక్‌ డకౌట్లతో విమర్శల పాలైన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. సూపర్‌-4లో భాగంగా భారత్‌తో మ్యాచ్‌లో 21 పరుగులు చేయగలిగాడు.

ఆ తర్వాత శ్రీలంకతో మ్యాచ్‌లో రెండు పరుగులు చేయగలిగిన సయీమ్‌.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో మరోసారి డకౌట్‌ అయ్యాడు. బ్యాటింగ్‌ పరంగా విఫలమైనా పార్ట్‌ టైమ్‌ స్పిన్నర్‌గా ఏడు వికెట్లు తీయగలిగాడు.

భవిష్యత్‌ ఆశాకిరణం
ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ వకార్‌ యూనిస్‌ సయీమ్‌ ఆయుబ్‌ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు. ‘‘అతడు రెండోసారి డకౌట్‌ అయినపుడే.. బెంచ్‌కే పరిమితం చేయాలని చెప్పాను. దానర్థం అతడిలో ప్రతిభ లేదని కాదు.

అతడు టాలెంటెడ్‌ ప్లేయర్‌. పాకిస్తాన్‌ క్రికెట్‌ భవిష్యత్‌ ఆశాకిరణం. కానీ కొన్నిసార్లు అనుకున్న ఫలితాలు రావు. ఆ క్రమంలో రోజురోజుకీ మరింత దిగజారితే ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ఆయుబ్‌ విషయంలో ఇదే జరిగింది. అతడి బాడీ లాంగ్వేజ్‌ పూర్తిగా వీక్‌గా అనిపిస్తోంది.

ఇలాంటపుడు బెంచ్‌కే పరిమితం చేయాలి
బౌలింగ్‌ చేస్తున్నాడు కాబట్టి అతడిని తుదిజట్టులోకి తీసుకుంటున్నారు. కానీ అతడు బౌలింగ్‌ కోసం కాదు.. బ్యాటింగ్‌ కోసం జట్టులో ఉంటున్నాడు. అతడు పరుగులు చేస్తున్నాడా లేదా అనేది ముఖ్యం. 

ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం అది జరగడం లేదు. అతడిని బెంచ్‌కే పరిమితం చేయాల్సి ఉంటుంది’’ అని వకార్‌ యూనిస్‌ పేర్కొన్నాడు. కాగా భారత్‌- పాకిస్తాన్‌ ఆసియా కప్‌-2025 ఫైనల్లో ఆదివారం తలపడనున్నాయి. ఇందుకు వేదిక దుబాయ్‌.

చదవండి: ఆసియా కప్‌: చరిత్ర సృష్టించిన నిసాంక.. కోహ్లి ఆల్‌టైమ్‌ రికార్డు బద్దలు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)