Breaking News

నితీశ్‌ కుమార్‌ రెడ్డిపై టీమిండియా కోచ్‌ కీలక వ్యాఖ్యలు

Published on Thu, 10/09/2025 - 12:18

టీమిండియాలోకి దూసుకువచ్చిన నయా సంచలనం నితీశ్‌ కుమార్‌ రెడ్డి (Nitish Kumar Reddy). ఈ ఆంధ్ర ఆల్‌రౌండర్‌ గతేడాదే టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ సందర్భంగా టెస్టుల్లో అడుగుపెట్టిన నితీశ్‌ రెడ్డి.. మెల్‌బోర్న్‌ క్రికెట్‌లో సెంచరీ (114)తో సత్తా చాటాడు.

వెస్టిండీస్‌తో సిరీస్‌లో.. 
ఇక ఇప్పటికే అంతర్జాతీయ టీ20లలోనూ ఎంట్రీ ఇచ్చిన నితీశ్‌ రెడ్డి.. ఆస్ట్రేలియాతో సిరీస్‌ (IND vs AUS) సందర్భంగా ఇటీవలే తొలిసారిగా వన్డే జట్టుకూ ఎంపికయ్యాడు. ఇక 22 ఏళ్ల ఈ సీమ్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్ ప్రస్తుతం వెస్టిండీస్‌ (IND vs WI)తో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్‌తో బిజీగా ఉన్నాడు.

బౌలింగ్‌ పరిమితం.. నో బ్యాటింగ్‌
అహ్మదాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో నితీశ్‌ రెడ్డికి.. విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే బౌల్‌ చేసే అవకాశం వచ్చింది. మొత్తంగా పదహారు పరుగులు ఇచ్చిన ఈ రైటార్మ్‌ ఫాస్ట్‌ మీడియం పేసర్‌.. రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌కే రాలేదు.

ఇక తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 445-8 వద్ద డిక్లేర్‌ చేయడం సహా..  ఇన్నింగ్స్‌ 140 పరుగుల తేడాతో గెలవడంతో నితీశ్‌ రెడ్డికి బ్యాటింగ్‌ చేసే అవకాశం కూడా రాలేదు. 

విదేశీ గడ్డపైనే కీలకం
ఈ నేపథ్యంలో విండీస్‌తో రెండో టెస్టుకు ముందు టీమిండియా అసిస్టెంట్‌ కోచ్‌ ర్యాన్‌ టెన్‌ డష్కాటే నితీశ్‌ రెడ్డిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ అరుదైన సీమ్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ సేవలను విదేశీ గడ్డపై ఎక్కువ ఉపయోగించుకోవాలని తాము భావిస్తున్నట్లు తెలిపాడు.

‘‘అతడొక అద్భుతమైన సీమ్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌. బ్యాటింగ్‌ చేయగల అరుదైన సీమ్‌ బౌలర్‌ తను. కాబట్టి తన శరీరానికి కూడా కాస్త విశ్రాంతి కావాలి. హార్దిక్‌ పాండ్యా విషయంలోనూ మేము ఇలాగే చేశాము.

సీమ్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్ల నైపుణ్యాల విషయంలో మాకు ఎలాంటి సందేహాలు లేవు. అయితే, టెస్టు క్రికెట్‌లో వారి శరీరం స్పందించే తీరు భిన్నంగా ఉంటుంది. తాను ఎంత గొప్పగా బ్యాటింగ్‌ చేయగలడో నితీశ్‌ రెడ్డి ఆస్ట్రేలియాలో నిరూపించాడు.

నాణ్యమైన ఆల్‌రౌండర్‌
విదేశీ గడ్డ మీద అతడు కీలకం. మున్ముందు ఎన్నో సవాళ్లు ఎదుర్కోబోతున్నాడు. ఇక స్వదేశంలో పరిస్థితులు వేరుగా ఉంటాయి. కాబట్టి అతడి సేవలను పరిమితం చేసినా పెద్దగా తేడా ఉండదు. 

అతడొక నాణ్యమైన ఆల్‌రౌండర్‌ అనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు’’ అని డష్కాటే చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియా- వెస్టిండీస్‌ జట్ల మధ్య ఢిల్లీ​ వేదికగా శుక్రవారం (అక్టోబరు 10)- మంగళవారం (అక్టోబరు 14) వరకు రెండో టెస్టుకు షెడ్యూల్‌ ఖరారైంది.

చదవండి: ఫిట్‌గానే ఉన్నా.. అందుకే నన్ను సెలక్ట్‌ చేయలేదు: స్పందించిన షమీ

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)