ఖాళీ కడుపుతోనే పాక్‌పై సెంచరీ చేశా: వీరేంద్ర సెహ్వాగ్

Published on Sun, 09/07/2025 - 19:36

ఆసియాక‌ప్‌-2025కు మ‌రో రెండు రోజుల్లో తెర‌లేవ‌నుంది. సెప్టెంబ‌ర్ 9న అబుదాబి వేదిక‌గా అఫ్గానిస్తాన్‌-హాంకాంగ్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. అయితే ఈ మ‌ల్టీ నేష‌న‌ల్ టోర్నమెంట్‌లో భార‌త్‌-పాకిస్తాన్ మ్యాచ్ కోసం అభిమానులు వెయ్యి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు. దాదాపు ఆరు నెలల త‌ర్వాత క్రికెట్ మైదానంలో చిర‌కాల ప్ర‌త్య‌ర్ధులు అమీతుమీ తెల్చుకోనున్నారు.

సెప్టెంబ‌ర్ 14న దుబాయ్ వేదిక‌గా దాయాదుల పోరు జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో టీమిండియా మాజీ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ అధికారిక బ్రాడ్ కాస్ట‌ర్ సోన్ స్పోర్ట్స్ నెట్‌వ‌ర్క్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చాడు. పాకిస్తాన్‌తో త‌న ఆడిన రోజుల‌ను సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు. పాక్‌పై ఓడిపోయినా ప్ర‌తీసారి త‌న అస‌హనానికి లోనయ్యేవాడ‌ని అని అత‌డు తెలిపాడు. 

"పాకిస్తాన్‌పై ఓడిపోయిన ప్ర‌తీసారి నేను కుంగిపోయేవాడిని. ఫ‌లితంగా నా ఏకాగ్ర‌త‌ను కోల్పోయేవాడని. ఆ స‌మ‌యంలో ప్రతిదీ  కోల్పోయిన‌ట్లు అన్పించేది" అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

కాగా ఈ నజాఫ్‌గఢ్ నవాబుకు ప్ర‌త్య‌ర్ధి పాకిస్తాన్ అయితే చాలు ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోయేవాడు. ముఖ్యంగా టెస్టుల్లో అయితే పాక్‌కు చుక్క‌లు చూపించేవాడు. సెహ్వాగ్ త‌న తొలి ట్రిపుల్ సెంచ‌రీని పాక్ పైనే న‌మోదు చేశాడు.

2008లో పాకిస్తాన్ టూర్‌లో క‌రాచీ వేదిక‌గా జరిగిన వ‌న్డే మ్యాచ్‌లో సెహ్వాగ్ ఆడిన ఇన్నింగ్స్ ఎప్ప‌టికి అభిమానుల‌కు గుర్తుండిపోతుంది. 300 ప‌రుగుల టార్గెట్‌ను చేధించే క్ర‌మంలో వీరు సూప‌ర్ సెంచ‌రీతో చెల‌రేగాడు. 95 బంతుల్లోనే 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 119 పరుగులు సాధించాడు. ఈ సెంచ‌రీ కోసం కూడా తాజా ఇంట‌ర్వ్యూలో వీరేంద్రుడు మాట్లాడాడు.

"క‌రాచీ వ‌న్డే రోజున నేను ఊప‌వాసంతో ఉన్నాను. ఖాలీ క‌డుపుతో బ్యాటింగ్ చేయాల్సి వ‌చ్చింది. కానీ ఆ మ్యాచ్‌లో ప‌రుగులు సాధించి నా ఆక‌లిని తీర్చుకున్నాను" అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.

Videos

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)