Breaking News

యో-యో టెస్ట్‌పై వీరేంద్ర సెహ్వాగ్‌ సంచలన వ్యాఖ్యలు

Published on Tue, 03/21/2023 - 18:42

క్రికెటర్ల ఫిట్‌నెస్‌ ప్రమాణాలను పరీక్షించే యో-యో టెస్ట్‌పై టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. యో-యో ఫిట్‌నెస్‌ టెస్ట్‌తో పాటు బోన్‌ స్కాన్‌ టెస్ట్‌ 'డెక్సా'ను బీసీసీఐ ఈ ఏడాది జనవరి నుంచి తిరిగి అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో వీరూ స్పందించాడు. టీమిండియాకు ఎంపిక కావాలంటే తప్పనిసరిగా యో-యో ఫిట్‌నెస్‌ టెస్ట్‌ క్లియర్‌ చేయాలన్న బీసీసీఐ షరతుపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. జట్టు ఎంపిక విషయంలో బీసీసీఐ అవలంభిస్తున్న ఫిట్‌నెస్‌ ప్రమాణాల వల్ల కెరీర్‌లు నాశనమవుతాయే కానీ ఫలితం​ శూన్యమని తెలిపాడు.

యో-యో టెస్ట్‌ను బీసీసీఐ కనీస అర్హతగా పేర్కొనడాన్ని ఖండించిన ఆయన.. తమ జమానాలో యో-యో టెస్ట్‌ను తప్పనిసరి చేసుంటే చాలామంది దిగ్గజ ఆటగాళ్లు ఫెయిల్‌ అయ్యేవారని, వారికి జట్టులో స్థానం కూడా దక్కేది కాదని అన్నాడు. తాము క్రికెట్‌ ఆడే రోజుల్లో బీసీసీఐ స్కిల్ డెవలప్‌మెంట్‌పై దృష్టి సారించేదని, ఇప్పుడు పరిస్థితి ఇంకోలా మారిపోయిందని తెలిపాడు.

క్రికెటర్లు మంచి రన్నర్‌లు కావాలనుకుంటే క్రికెట్‌ ఆడించాల్సిన పనిలేదని, వారితో మారథాన్‌లు ప్రాక్టీస్‌ చేయిస్తే సరిపోతుందని వ్యంగ్యంగా సూచించాడు. ఆటగాళ్లు ఏ విభాగంలో అయినా రాణించాలంటే స్కిల్‌ డెవలప్‌ చేసుకుంటే సరిపోతుందని.. వెయిట్‌ లిఫ్టింగ్‌, రన్నింగ్‌, సిక్స్‌ ప్యాక్‌ బాడీలపై అధికంగా ఫోకస్‌ పెడితే గాయాల బారిన పడి కెరీర్‌లు అర్ధంతరంగా ముగుస్తాయే తప్ప సాధించేది ఏదీ ఉండదని అన్నాడు. జిమ్‌లో సాధన, అధిక బరువులు మోయడం వల్ల కెరీర్‌ స్పాన్‌ పెరుగుతుందని అనుకుంటే పొరబడ్డట్టేనని, ఇలా చేయడం వల్ల గాయాలు తీవ్రతరమైతాయే తప్ప ఎలాంటి ఫలితం ఉండదని చెప్పుకొచ్చాడు. 

Videos

హౌస్ అరెస్టులతో అడ్డుకట్ట వేస్తారా? పోలీసులపై MLC రమేష్ ఫైర

YSRCP అభ్యర్థికి వార్నింగ్.. నామినేషన్లపై బెదిరింపుల ఆడియో వైరల్

మేయర్ గా గెలిచిన వెంటనే నేను చేయబోయే మొదటి పని...

రూ.5 లక్షలతో రూ.80 లక్షలు.. ఇదే ఆ సింపుల్ ట్రిక్

గాల్లో ఎగురుతూ ఆఫీసుకు! అమెరికా వ్యక్తి వెరైటీ జర్నీ..

గరివిడి లక్ష్మి చూసి.. పవన్, రవితేజ ఫిదా!

DSP ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన అవినాష్ రెడ్డి

ఓటమి భయంతోనే.. చంద్రబాబు అండ్ కో దాడులు

నామినేషన్ కేంద్రాల వద్ద రాళ్ల గుట్టలు.. YSRCP నేతలే టార్గెట్..!

టైగర్ ష్రాఫ్ కేసులో కొత్త కోణాలు..

Photos

+5

అల్లు శిరీష్-నయనిక జపాన్ ట్రిప్ (ఫొటోలు)

+5

అపరంజి బొమ్మలా నభా నటేశ్ (ఫొటోలు)

+5

ఏపీలో ప్రసిద్ధి చెందిన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఎక్కడో తెలుసా?

+5

విజయవాడ : భవానీ భక్తులతో ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

విజయదశమి శుభాకాంక్షలు చెప్పిన సెలెబ్రెటీలు (ఫొటోలు)

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)