Breaking News

అచ్చం నాలాగే..: రోహిత్‌తో కోహ్లి ఏం చెప్పాడంటే..

Published on Tue, 01/13/2026 - 11:36

టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లికి ఉన్న అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెద్దోళ్లే కాదు చిన్న పిల్లలూ అతడి ఫ్యాన్స్‌ జాబితాలో ఉంటారు. ఇటీవల న్యూజిలాండ్‌తో తొలి వన్డేకు ముందు ఓ ‘బుల్లి’ అభిమాని కోహ్లిని కలిశాడు.

ఇందులో ప్రత్యేకత ఏముంది అంటారా?.. ఆ చోటా ఫ్యాన్‌ కోహ్లి బాల్యంలో ఎలా ఉండేవాడో అచ్చం అలాగే ఉండటం ఇక్కడ విశేషం. ఈ విషయాన్ని కోహ్లి (Virat Kohli)నే స్వయంగా అంగీకరించాడు. అంతేకాదు రోహిత్‌ శర్మ (Rohit Sharma)తోనూ ఇదే విషయం చెప్పాడు. స్వదేశంలో కివీస్‌తో వన్డే సిరీస్‌తో టీమిండియా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా వడోదరలో ఇరుజట్ల మధ్య ఆదివారం తొలి వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌కు ముందు కోహ్లిని ఓ పిల్లాడు కలిశాడు. ఈ క్రమంలో కోహ్లి తనను చూసి ఎలా స్పందించాడో తాజాగా చెప్పుకొచ్చాడు. ‘‘కోహ్లి అని పిలిచి.. హాయ్‌ చెప్పాను.

నా డూప్లికేట్‌ అక్కడ కూర్చున్నాడు
ఒక్క నిమిషంలో వస్తాను అని కోహ్లి నాతో అన్నాడు. అంతలోనే రోహిత్‌ శర్మవైపు తిరిగి.. ‘నా డూప్లికేట్‌ (Young Virat Kohli Doppelganger) అక్కడ కూర్చున్నాడు చూడు’ అని చెప్పాడు. అక్కడున్న వాళ్లంతా నన్ను చోటా చీకూ అని పిలిచారు’’ అంటూ ఆ బుడ్డోడు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

93 పరుగులు
కాగా కోహ్లి ముద్దుపేరు చీకూ అన్న విషయం తెలిసిందే. తనలాగే ఉన్న ఆ పిల్లాడిని కలిసి.. అతడికి ఫొటోగ్రాఫ్‌ కూడా ఇచ్చి ఖుషీ చేశాడు కోహ్లి. ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలి వన్డేలో భారత్‌ న్యూజిలాండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది.

కివీస్‌ విధించిన 301 పరుగుల లక్ష్యాన్ని 49 ఓవర్లలోనే భారత్‌ ఛేదించింది. కోహ్లి సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ 93 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా 45వ సారి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. మరోవైపు.. రోహిత్‌ శర్మ ఈ మ్యాచ్‌లో 26 పరుగులు చేయగలిగాడు. ఇక భారత్‌- కివీస్‌ మధ్య బుధవారం నాటి రెండో వన్డేకు రాజ్‌కోట్‌ వేదిక.

చదవండి: T20 WC 2026: నెదర్లాండ్స్‌ జట్టు ప్రకటన.. ‘మనోళ్ల’పై వేటు!

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)