Breaking News

IPL 2026: కోహ్లీ ప్రాక్టీస్‌.. ఐపీఎల్‌ జరుగుతుందా?

Published on Wed, 03/11/2026 - 13:50

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2026 ప్రారంభ తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లీ మాత్రం తన ప్రాక్టీస్‌ను మొదలుపెట్టాడు. ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్బీబీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లీ తాజాగా ఐపీఎల్‌ కోసం నెట్స్‌లో తీవ్రంగా కసరత్తులు చేస్తున్న వీడియోనూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నాడు.  ‘ఐపీఎల్‌ 2026’ అని క్యాప్షన్‌ మాత్రమే జత చేసినప్పటికీ కోహ్లీ ప్రాక్టీస్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెట్స్‌లో బరిలోకి దిగిన కోహ్లీ చేతికి గ్లోవ్స్‌, తలకు హెల్మెట్‌ పెట్టుకొని బరిలోకి దిగడం, బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌లో కొన్ని అద్భుతమైన షాట్లు ఆడడం ముగ్ధమనోహరంగా అనిపించింది. 

కోహ్లీ చివరిసారిగా గత జనవరిలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ ఆడాడు. ఆ సిరీస్‌లో కోహ్లీ ఒక సెంచరీ, అర్థసెంచరీ సాయంతో టీమిండియా తరఫున టాప్‌ స్కోరర్‌గా నిలిచినప్పటికీ భారత్‌ మాత్రం 1-2 తేడాతో కివీస్‌కు సిరీస్‌ కోల్పోయింది. ఇక ఐపీఎల్‌ 2025 విజేతగా ఆర్సీబీ నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సీజన్‌లో కోహ్లీ 144 స్ట్రైక్‌రేట్‌తో 657 పరుగులు సాధించాడు. 17 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో ఒకే జట్టుకు కొనసాగుతూ వచ్చిన కోహ్లీ మొత్తంగా ఐపీఎల్లో 8,661 పరుగులు సాధించాడు. ఇక గతేడాది తొలిసారి టైటిల్‌ సాధించిన బెంగళూరు జట్టు ఈసారి కూడా టైటిల్‌ గెలవాలన్న కృతనిశ్చయంతో ఉంది. 

మార్చి 28 నుంచి ఐపీఎల్‌ 18వ సీజన్‌ షురూ కావాల్సి ఉన్నప్పటికీ బీసీసీఐ ఇప్పటికీ షెడ్యూల్‌ విడుదల చేయకపోవడం గమనార్హం. అయితే దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఈసారి ఐపీఎల్‌ను రెండు విడతల్లో నిర్వహించాలని ఇప్పటికే ఐపీఎల్‌ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. కానీ పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా విమాన సర్వీసుల రద్దుతో విదేశీ ఆటగాళ్ల ప్రయాణాలకు ఇబ్బంది ఏర్పడడం, ఎల్పీజీ సంక్షోభంతో బెంగళూరు, ముంబైలో హోటళ్లు మూతపడడం లాంటి కారణాల వల్ల అసలు అనుకున్న సమయానికి ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభమవుతుందా లేక వాయిదా పడుతుందా అన్నది చూడాలి.

చదవండి: స్లో బంతుల వెనుక 16 ఏళ్ల కథ!

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)