Breaking News

విరాట్‌ కోహ్లి వచ్చేశాడు.. కెప్టెన్‌గా రిషభ్‌ పంత్‌

Published on Fri, 12/19/2025 - 21:33

దేశవాళీ వన్డే టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీ-2025కి ఢిల్లీ అండ్‌ డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (డీడీసీఏ) తమ జట్టును ప్రకటించింది. టీమిండియా దిగ్గజం విరాట్‌ కోహ్లి తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. అదే విధంగా భారత టెస్టు జట్టు వైస్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌.. ఈ టోర్నీలో ఢిల్లీ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది.

ఇక మరో టీమిండియా స్టార్‌ పేసర్‌ హర్షిత్‌ రాణా వీలు చిక్కినపుడు మ్యాచ్‌లకు వస్తాడని తెలిపిన డీడీసీఏ.. భారత మాజీ స్టార్‌ బౌలర్‌ ఇషాంత్‌ శర్మ, నవదీప్‌సైనీ కూడా ఈసారి జట్టులో భాగం కానున్నారని తెలిపింది. కాగా పంత్‌ డిప్యూటీగా ఆయుశ్‌ బదోని వ్యవహరించనుండగా.. తేజస్వి సింగ్‌ వికెట్‌ కీపర్‌గా సేవలు అందించనున్నాడు.

2010లో చివరిసారిగా
కాగా 2010లో చివరిసారిగా విరాట్‌ కోహ్లి తన సొంత జట్టు ఢిల్లీ తరఫున విజయ్‌ హజారే ట్రోఫీ ఆడాడు. వన్డే క్రికెట్‌లో రారాజుగా వెలుగొందుతూ అత్యధిక సెంచరీల (53) వీరుడిగా రికార్డులకెక్కిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ దేశీ క్రికెట్‌ బరిలో దిగనున్నాడు. 

ప్రతి ఒక్క ఆటగాడు కనీసం రెండు దేశీ మ్యాచ్‌లు అయినా ఆడాలన్న బీసీసీఐ నిబంధనల నేపథ్యంలో కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ముంబై తరఫున ఆరంభ మ్యాచ్‌లకు మాత్రం రోహిత్‌ శర్మ అందుబాటులో ఉండటం లేదని ఎంసీఏ చీఫ్‌ సెలక్టర్‌ సంజయ్‌ పాటిల్‌ తాజాగా వెల్లడించాడు.

విజయ్‌ హజారే ట్రోఫీ-2025 మ్యాచ్‌లకు ఢిల్లీ జట్టు
రిషబ్ పంత్ (కెప్టెన్‌), ఆయుష్ బదోని (వైస్‌ కెప్టెన్‌), అర్పిత్ రాణా, విరాట్ కోహ్లి, హర్షిత్ రాణా, నితీష్ రాణా, యశ్ ధుల్, సార్థక్ రంజన్, నవదీప్ సైనీ, ఇషాంత్ శర్మ, హృతిక్ షోకీన్, తేజస్వి సింగ్ (వికెట్‌ కీపర్‌), హర్ష్ త్యాగి, సిమర్‌జీత్ సింగ్, ప్రిన్స్ యాదవ్‌, ఆయుశ్‌ దొసేజా, దివిజ్‌ మెహ్రా, వైభవ్‌ కంద్పాల్‌, రోహన్‌ రాణా, అనూజ్‌ రావత్‌. 

చదవండి: ఊహించని షాకిచ్చిన రోహిత్‌ శర్మ!

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)