Breaking News

టీమిండియాకు షాక్‌.. ఆరు నెల‌లు ఆట‌కు దూరమైన కోహ్లీ!

Published on Fri, 06/05/2026 - 21:22

టీమిండియా స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ గాయం కార‌ణంగా ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్‌కు దూర‌మ‌య్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. ఇప్పటికే కాలి పిక్క కండ‌రాల గాయంతో అఫ్గానిస్తాన్‌తో వ‌న్డే సిరీస్‌కు దూరమైన కోహ్లీ తాజాగా గాయం తీవ్రత ఎక్కువ‌గా ఉంద‌ని తేలింది. దీంతో కోహ్లీ కోలుకోవ‌డానికి ఆరు నెల‌ల స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశ‌ముంద‌ని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది. 

దీంతో జూలైలో ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న వ‌న్డే సిరీస్‌కు కోహ్లీ దూర‌మైన‌ట్లే. అయితే దీనిపై బీసీసీఐ అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయాల్సి ఉంది. 'కోహ్లీ తొడ కండరంలో చీలిక వ‌చ్చింది. ఈ గాయానికి శస్త్రచికిత్స అవసరం లేదు. అయితే ఇది నయం కావడానికి మాత్రం సుమారు ఆరు వారాల సమయం పట్ట‌నుంది. 

దీనిలో భాగంగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కోహ్లీ పునరావాసం పొందే అవ‌కాశ‌ముంది. కాగా కోహ్లీ త‌న గాయంపై ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలోని ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దిన్‌షా పర్దివాలాను టెలి-కన్సల్ట్ అయ్యాడు. ఎంఆర్ఐ స్కాన్‌లో కండ‌రాల్లో చీలిక వ‌చ్చిన‌ట్లు రిపోర్ట్‌లో తేలింది.' అని పేర్కొంది.

ఇదిలా ఉండగా, ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు ముందు ఫిట్‌నెస్ మదింపు కోసం రోహిత్ శర్మ జూన్ 8న బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)కి హాజరుకానున్నట్లు కూడా ఆ నివేదిక పేర్కొంది . ఈ సిరీస్ కోసం రోహిత్‌ను జట్టులోకి తీసుకున్నప్పటికీ, అతని లభ్యత పూర్తిగా ఫిట్‌నెస్ పరీక్షల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. 

చదవండి: కుప్ప‌కూలిన కివీస్‌.. భారీ ఆధిక్యం దిశ‌గా ఇంగ్లండ్

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)