Breaking News

ఢిల్లీ క్యాపిటల్స్‌ స్టార్‌కు బెదిరింపులు

Published on Mon, 11/10/2025 - 15:26

ఐపీఎల్‌లో (IPL) ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తరఫున మెరిసిన యువ ఆల్‌రౌండర్‌ విప్రాజ్‌ నిగమ్‌ (Vipraj Nigam) బెదిరింపులకు గురయ్యాడు. నవంబర్ 9న అతడికి ఓ అంతర్జాతీయ ఫోన్‌ నంబర్ నుంచి అనేక బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఓ మహిళ అతన్ని బ్లాక్‌మెయిల్ చేస్తూ, ఓ వీడియోను లీక్ చేస్తానని బెదిరించింది.

తొలుత విప్రాజ్‌ దీన్ని ఫేక్‌ కాల్‌గా భావించి, నంబర్‌ను బ్లాక్‌ చేశాడు. అయినా సదరు మహిళ వేరే నంబర్ల నుంచి ఫోన్‌ చేసి విప్రాజ్‌ను పదేపదే ఇబ్బంది పెట్టింది. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన విప్రాజ్ వెంటనే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. 

తన పరువుకు భంగం కలిగించడం, మానసికంగా వేధించడం ద్వారా తన క్రికెట్ కెరీర్‌ను నాశనం చేయాలనే కుట్ర జరుగుతోందని అతను ఆరోపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి సదరు కాల్ వివరాలు, ఫోన్‌ నంబర్ల మూలాలను పరిశీలిస్తున్నారు. 

ఈ విషయంపై విప్రాజ్‌ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న తమ కుమారుడిని బద్నాం చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు.

21 ఏళ్ల విప్రాజ్‌ గత సీజన్‌లోనే (2025) ఐపీఎల్‌ అరంగేట్రం చేశాడు. అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. కుడి చేతి వాటం లెగ్‌ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన విప్రాజ్‌ అరంగేట్రం సీజన్‌లోనే అదరగొట్టాడు. 14 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీసి, 142 పరుగులు చేశాడు. లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగి పలు మ్యాచ్‌లో మెరుపులు మెరిపించాడు.

గతేడాదే విప్రాజ్‌ ఉత్తరప్రదేశ్ తరఫున దేశవాలీ అరంగేట్రం చేశాడు. 3 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు, 5 లిస్ట్‌-ఏ మ్యాచ్‌లు, 15 టీ20లు ఆడి మొత్తంగా 32 వికెట్లు తీశాడు. 

చదవండి: బంగ్లాదేశ్‌ మాజీ కెప్టెన్‌కు తీవ్ర అస్వస్థత

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)