VHT: ‘వన్డే’లో ‘కరీంనగర్‌’ కుర్రాడి డబుల్‌ సెంచరీ

Published on Tue, 01/06/2026 - 13:35

బెంగాల్‌తో మ్యాచ్‌లో హైదరాబాద్‌ బ్యాటర్‌ అమన్‌ రావు పేరాల ఆకాశమే హద్దుగా చెలరేగాడు. విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26 టోర్నమెంట్లో భాగంగా మంగళవారం నాటి మ్యాచ్‌లో ఏకంగా డబుల్‌ సెంచరీతో సత్తా చాటాడు. మొహమ్మద్‌ షమీ (Mohammed Shami) వంటి టీమిండియా సీనియర్‌ బౌలర్‌తో కూడిన పటిష్ట బెంగాల్‌ బౌలింగ్‌ను ఎదుర్కొంటూ.. అజేయ ద్విశతకంతో దుమ్ములేపాడు.

చరిత్ర సృష్టించిన అమన్‌ రావు
తద్వారా హైదరాబాద్‌ తరఫున లిస్ట్‌-ఎ క్రికెట్‌లో డబుల్‌ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా.. ఓవరాల్‌గా తొమ్మిదో ప్లేయర్‌గా అమన్‌ రావు చరిత్ర సృష్టించాడు. దేశీ వన్డే టోర్నీలో భాగంగా రాజ్‌కోట్‌ వేదికగా గ్రూప్‌-బి నుంచి బెంగాల్‌తో మ్యాచ్‌లో టాస్‌ ఓడిన హైదరాబాద్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది.

12 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో
ఓపెనర్లు అమన్‌ రావు పేరాల, గహ్లోత్‌ రాహుల్‌ సింగ్‌ ఆది నుంచే బెంగాల్‌ బౌలర్లపై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో 154 బంతులు ఎదుర్కొన్న అమన్‌ రావు 12 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 200 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మరోవైపు.. రాహుల్‌ సింగ్‌ సైతం అర్థ శతకం (54 బంతుల్లో 65)తో మెరిశాడు.

తిలక్‌ వర్మ విఫలమైనా
అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ తిలక్‌ వర్మ (45 బంతుల్లో 34) మాత్రం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. మిగతా వారిలో అభిరథ్‌ రెడ్డి (5), ప్రణవ్‌ వర్మ (7) విఫలం కాగా.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ప్రజ్ఞయ్‌ రెడ్డి (22) ఓ మోస్తరుగా రాణించాడు.

ఓవైపు వికెట్లు పడుతున్నా అమన్‌ రావు మాత్రం నిలకడగా ఆడుతూ.. జట్టుకు భారీ స్కోరు అందించడంలో సఫలమయ్యాడు. అతడికి తోడుగా చామా మిలింద్‌ ఆరు పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో హైదరాబాద్‌ ఐదు వికెట్ల నష్టానికి 352 పరుగులు సాధించింది.

షమీ బౌలింగ్‌ను చితక్కొట్టాడు
బెంగాల్‌ బౌలర్లలో షమీ మూడు వికెట్లు తీయగా.. షాబాజ్‌ అహ్మద్‌, రోహిత్‌ దాస్‌ చెరో వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా షమీ బౌలింగ్‌లో అమన్‌ రావు ఫోర్లు, వరుస సిక్సర్లతో చెలరేగడం విశేషం. అంతేకాదు ఆఖరి బంతికి ఆకాశ్‌ దీప్‌ బౌలింగ్‌లో సిక్స్‌ బాది డబుల్‌ సెంచరీ  పూర్తి చేసుకోవడం మరో విశేషం.

కరీంనగర్‌ కుర్రాడు
కాగా 21 ఏళ్ల అమన్‌ రావు స్వస్థంల కరీంనగర్‌ జిల్లాలోని సైదాపూర్‌ మండలంలో గల వెన్నంపల్లి గ్రామం. ఇటీవల ఐపీఎల్‌ మినీ వేలం-2026లో రాజస్తాన్‌ రాయల్స్‌ రూ. 30 లక్షల కనీస ధరకు ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ను కొనుగోలు చేసింది.

చదవండి: మూడోసారి తండ్రి అయిన అంబటి రాయుడు

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)