Breaking News

హైదరాబాద్‌ ఓటమి.. కేదార్‌ జాదవ్‌ కెప్టెన్సీలో మహారాష్ట్ర గెలుపు

Published on Sat, 12/02/2023 - 11:28

జైపూర్‌: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌హజారే ట్రోఫీలో హైదరాబాద్‌కు ‘హ్యాట్రిక్‌’ పరాజయం ఎదురైంది. గ్రూప్‌ ‘బి’లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర 3 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. ఈ వన్డే టోర్నీలో తొలి 2 మ్యాచ్‌లు నెగ్గిన హైదరాబాద్‌ ఆపై వరుసగా మూడు మ్యాచ్‌లలో పరాజయంపాలైంది.

మహారాష్ట్రతో శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. తన్మయ్‌ అగర్వాల్‌ (117 బంతుల్లో 103; 9 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీ సాధించగా... కెప్టెన్‌ రాహుల్‌ సింగ్‌ (69), రాహుల్‌ బుద్ధి (58 నాటౌట్‌), రవితేజ (51 నాటౌట్‌) హాఫ్‌ సెంచరీలతో అండగా నిలిచారు.

అనంతరం మహారాష్ట్ర 49.4 ఓవర్లలో 7 వికెట్లకు 316 పరుగులు సాధించింది. అంకిత్‌ బావ్నే (108 బంతుల్లో 113; 12 ఫోర్లు, 1 సిక్స్‌) శతకానికి తోడు అజీమ్‌ కాజీ (80), కౌశల్‌ తాంబే (38), కెప్టెన్‌ కేదార్‌ జాదవ్‌ (32 నాటౌట్‌) రాణించి జట్టును గెలిపించారు. మరోవైపు చండీగఢ్‌లో ఆంధ్ర, గుజరాత్‌ జట్ల మధ్య జరగాల్సిన గ్రూప్‌ ‘డి’ మ్యాచ్‌ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది.    

చదవండి: టీమిండియా హెడ్‌కోచ్‌ అయితేనేం! కుమారుల కోసం అలా..

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)