Breaking News

కాంస్యంతో మెరిసిన ‘రిక్షావోడు’ .. కామన్‌వెల్త్‌లో భారత్‌ బోణీ

Published on Sat, 07/25/2026 - 07:05

గ్లాస్కో వేదిక‌గా జ‌రుగుతున్న కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో భార‌త్ ప‌త‌కాల బోణీ చేసింది. పురుషుల పారా ప‌వ‌ర్‌లిఫ్టింగ్ హెవీవెయిట్ కేట‌గిరీలో ఝండు కుమార్ కాంస్యంతో మెరిశాడు. గ్రూప్‌-బి నుంచి బ‌రిలోకి దిగిన ఝండు త‌న రెండో ప్ర‌య‌త్నంలో 190 కేజీల బ‌రువును ఎత్తి 130.9 పాయింట్లు స్కోరును సాధించాడు. 

ఇప్ప‌టివ‌ర‌కు ఝండు కెరీర్‌లో అత్యుత్త‌మంగా ఉన్న 198 కేజీల బ‌రువును అధిగ‌మించ‌న‌ప్ప‌టికీ తాజా కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో మాత్రం కాంస్యాన్ని ఒడిసిప‌ట్టాడు. మూడో ప్ర‌య‌త్నంలో 196 కేజీల బ‌రువు ఎత్తే ప్ర‌య‌త్నంలో విఫ‌ల‌మ‌య్యాడు. అయిన‌ప్ప‌టికీ త‌న కంటే ఎక్కువ‌గా ఎవ‌రు బ‌రువు ఎత్త‌క‌పోవ‌డంతో గ్రూప్‌-బి నుంచి తొలి స్థానంలో, ఓవ‌రాల్‌గా మూడో స్థానంలో నిలిచి ప‌త‌కం ఖాయం చేసుకున్నాడు. 

ఇక నైజీరియాకు చెందిన రిలువాన్ ఇద్రిస్ 208 కిలోల బ‌రువు ఎత్తి 132.8 పాయింట్లు సాధించి పోడియంపై తొలి స్థానంలో నిలిచి బంగారు ప‌త‌కం అందుకున్నాడు. ఇక 199 కిలోల బ‌రువు ఎత్తిన ఇంగ్లండ్‌కు చెందిన మాథ్యూ హార్డింగ్ 131 పాయింట్ల‌తో రెండో స్థానంలో నిలిచి వెండిని కైవ‌సం చేసుకున్నాడు. ఇక కాంస్య పతకం గెలుచుకున్న అనంతరం ఝండు కుమార్‌ మాట్లాడాడు.

‘నా ప్ర‌ద‌ర్శ‌న ప‌ట్ల సంతృప్తిగా ఉన్నా. భార‌త్‌కు ఇది చాలా ముఖ్యం. ఈ గేమ్స్‌లో నాదే దేశానికి తొలి ప‌త‌కం కావ‌డాన్ని మాటల్లో వ‌ర్ణించ‌లేక‌పోతున్నా. జాతీయ జెండాను పోడియంపై చూసిన‌ప్పుడు గ‌ర్వంగా ఫీల‌య్యాను. థాంక్యూ ఇండియా. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. నేను ప‌త‌కం గెలిచిన విష‌యాన్ని ముందుగా ఇంట్లో అమ్మానాన్నలకు చెప్తాను. అలాగే, చిన్నప్పటి నుంచి నాకు అండ‌గా నిలిచిన నా స్నేహితుడు గౌతమ్ భయ్యాకు కూడా విష‌యాన్ని చెప్పాలి’ అంటూ ఎమోషనల్‌ అయ్యాడు. 

ఈ-రిక్షా నుంచి వెయిట్‌లిఫ్టర్‌ దాకా
పేదరికం విజయకాంక్షను పెంచుతుందనే మాట పారా పవర్‌లిఫ్టర్ ఝండు కుమార్‌ సాధించిన ఘనత ద్వారా మరోసారి నిరూపితమైంది. హర్నౌత్‌కు చెందిన ఒక కూరగాయల వ్యాపారి కుమారుడైన ఝండు ఒక ఈ-రిక్షా డ్రైవర్‌గా తన జీవితాన్ని ప్రారంభించాడు. హర్నౌత్‌లోని ది రాక్‌ స్టార్‌ జిమ్‌ యజమాని గౌతమ్‌ సింగ్‌ రాకతో ఝండు జీవితం పూర్తిగా మారిపోయింది. 

ఇటీవల ముగిసిన ఖేలో ఇండియా పారా గేమ్స్ (కేఐపీజీ)లో స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. మార్చి 23న జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలోని వెయిట్‌లిఫ్టింగ్ హాల్‌లో జరిగిన పురుషుల 72 కేజీల విభాగంలో, ఆ పవర్‌లిఫ్టర్ 206 కేజీల బరువును ఎత్తి తన సొంత జాతీయ రికార్డును బద్దలు కొట్టి అగ్రస్థానంలో నిలిచాడు. మార్చి 17-18 తేదీలలో నోయిడాలో జరిగిన పారా నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో ఝండు 205 కేజీల బరువును ఎత్తి, సుధీర్ కుమార్ యొక్క 192 కేజీల జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు.

పుట్టుకతో పోలియో
28 ఏళ్ల అతనికి పుట్టుకతోనే పోలియో సోకిన కాళ్లు ఉన్నాయి. అతని పారా స్పోర్ట్స్ ప్రయాణం 2017లో ప్రారంభమైంది. మొదట్లో, అతను షాట్‌పుట్, డిస్కస్ త్రోలో పోటీపడ్డాడు. ఆ సమయంలో, అతనికి పారా పవర్‌లిఫ్టింగ్ గురించి తెలియదు. F-55 కేటగిరీలో, ఝండు అనేక షాట్‌పుట్డి, డిస్కస్ త్రో ఈవెంట్లలో పాల్గొని విజయం సాధించాడు, కానీ అతని గమ్యం వేరే చోట ఉండటంతో, విధి అతన్ని ఆ దిశగా నడిపించింది.

కష్టాలతో కూడిన ప్రయాణం తర్వాత, అతను గాంధీనగర్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(NCOE)కి చేరుకున్నాడు. ప్రముఖ పారా కోచ్ రాజిందర్ సింగ్ రాహేలు మార్గదర్శకత్వంలో పవర్‌ వెయిట్‌లిఫ్టర్‌గా కెరీర్‌ ప్రారంభించాడు. డిసెంబర్ 2023లో, KIPG తొలి ఎడిషన్‌లో పవర్‌లిఫ్టింగ్ విభాగంలో ఝండు కుమార్‌ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. 2028 లాస్‌ ఏంజెలెస్‌ పారా ఒలింపిక్స్‌లో  స్వర్ణం గెలవడమే తన లక్ష్యమని ఝండు కుమార్‌ పేర్కొన్నాడు.

ప్ర‌ధాని మోదీ అభినంద‌న‌లు
కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో దేశానికి తొలి ప‌త‌కం అందించిన ఝండు కుమార్‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ 'ఎక్స్' వేదిక‌గా అభినంద‌న‌లు తెలిపారు. 'కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో పురుషుల హెవీవెయిట్ పారా ప‌వ‌ర్‌లిఫ్టింగ్ ఈవెంట్‌లో కాంస్యం గెలిచిన ఝండు కుమార్‌కు అభినంద‌న‌లు. అతడి అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో భార‌త్ ప‌త‌కాల ప‌ట్టిక‌ను తెర‌వ‌డం గొప్ప విష‌యం. అత‌డి విజ‌యం అపార‌మైన శ‌క్తికి, అత‌డి సంక‌ల్పానికి, ఎన్నో ఏళ్ల త‌ర‌బ‌డి క్ర‌మ‌శిక్ష‌ణ‌కు నిద‌ర్శ‌నం. త‌న జీవితంలో ఎదురైన ప్ర‌తీ స‌వాల్‌ను అధిగ‌మించి ఇవాళ అంత‌ర్జాతీయ వేదిక‌పై మువ్వ‌న్నెల జెండాను ఎగుర‌వేసి దేశానికి గ‌ర్వ‌కార‌ణంగా నిలిచి భార‌తీయులందరికి స్ఫూర్తిగా నిలిచాడు.' అని మోదీ కొనియాడారు.

 

 

చదవండి: గోళీలాట మాదిరే లాన్‌ బౌల్స్‌.. కాని చిన్న ట్విస్ట్‌!

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)