Breaking News

IND VS AUS: వైభవ్‌, వేదాంత్‌ శతకాలు.. టీమిండియా భారీ స్కోర్‌

Published on Wed, 10/01/2025 - 12:34

ఆస్ట్రేలియా పర్యటనలో భారత యువ జట్టు (అండర్‌-19) దుమ్మురేపుతుంది. తొలుత వన్డే సిరీస్‌ను క్లీన్‌ చేసిన భారత్‌.. రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను (India U19 vs Australia U19) ఘనంగా ప్రారంభించింది. బ్రిస్బేన్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 428 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) (86 బంతుల్లో 113; 9 ఫోర్లు, 8 సిక్సర్లు), మిడిలార్డర్‌ బ్యాటర్‌ వేదాంత్‌ త్రివేది (Vedant Trivedi) (192 బంతుల్లో 140; 19 ఫోర్లు) శతకాలతో కదంతొక్కారు.  ఖిలన్‌ పటేల్‌ (49) రాణించాడు. 

ఆయుశ్‌ మాత్రే (21), అభిగ్యాన్‌ కుందు (26), రాహుల్‌ కుమార్‌ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆసీస్‌ బౌలర్లలో కెప్టెన్‌ విల్‌ మలాజ్‌చుక్‌, హేడెన్‌ స్కిల్లర్‌ తలో 3 వికెట్లు తీయగా.. ఆర్యన్‌ శర్మ 2, థామస్‌ ప్యాడింగ్టన్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

అంతకుముందు భారత బౌలర్లు చెలరేగడంతో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగలకు ఆలౌటైంది. పేసర్‌ దీపేశ్‌ దేవేంద్రన్‌ (16.2-6-45-5) ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆసీస్‌  పతనాన్ని శాశించాడు.మరో పేసర్‌ కిషన్‌ కుమార్‌ (16-4-48-3) కూడా సత్తా చాటాడు. అన్మోల్జీత్‌ సింగ్‌, ఖిలన్‌ పటేల్‌ తలో వికెట్‌ తీశారు. 

ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో వన్‌ డౌన్ బ్యాటర్‌ స్వీవెన్‌ హోగన్‌ (246 బంతుల్లో 92) ఒక్కడే రాణించాడు. భారత్‌కు 185 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. ప్రస్తుతం ఆట రెండో రోజు మూడో సెషన్‌ నడుస్తుంది. 

చదవండి: World Cup 2025: చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్‌

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)