Breaking News

వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం.. 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో

Published on Sat, 01/10/2026 - 15:37

భార‌త యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ త‌న సూపర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. అండర్-19 ప్రపంచకప్ 2026 సన్నాహకాల్లో భాగంగా  స్కాట్లాండ్‌తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో వైభ‌వ్ విధ్వంసం సృష్టించాడు. 14 ఏళ్ల సూర్యవంశీ స్కాట్లాండ్ బౌలర్లను ఉతికారేశాడు. దాదాపు 192 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి టీమిండియాకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు.

ఈ క్రమంలో కేవలం 27 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 50 బంతులు ఎదుర్కొన్న వైభవ్‌.. 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో 96 పరుగులు చేశాడు. కేవలం 4 పరుగుల దూరంలో సెంచరీని చేజార్చుకున్నాడు. అతడు సాధించిన స్కోర్‌లో 78 పరుగులు కేవలం బౌండరీల ద్వారానే రావడం గమనార్హం. 

అతడితో పాటు ఆరోన్‌ జార్జ్‌ 61 పరుగులతో రాణించారు. 33 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 3 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. క్రీజులో ప్రస్తుతం అభిజ్ఞాన్ కుండు(10), విహాన్ మల్హోత్రా(46) ఉన్నారు. అయితే గాయం నుంచి కోలుకుని తిరిగొచ్చిన కెప్టెన్ అయూష్ మాత్రం తీవ్ర నిరాశపరిచాడు. మాత్రే కేవలం 22 పరుగులు చేసి ఔటయ్యాడు.

కాగా  వార్మాప్ మ్యాచ్‌లకు ముందు దక్షిణాఫ్రికాతో జరిగిన యూత్ వన్డే సిరీస్‌లోనూ వైభవ్ అద్భుతాలు చేశాడు. రెండో వన్డేలో కేవలం 74 బంతుల్లో 127 పరుగులు చేసిన వైభవ్‌.. మూడో వన్డేలో 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. ఇక వరల్డ్‌కప్‌ ప్రధాన టోర్నీ జనవరి 15 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో భారత్‌, అమెరికా జట్లు తలపడనున్నాయి.
చదవండి: WPL 2026: ఈ ఐదుగురు ప్లేయర్లపైనే కళ్లన్నీ.. గొంగడి త్రిషకు మంచి రోజులు వచ్చినట్లేనా?

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)