వైభ‌వ్ సూర్య‌వంశీకి బిగ్‌ ప్ర‌మోష‌న్‌!

Published on Mon, 04/20/2026 - 15:06

ఐపీఎల్ 2026 సీజన్ అనంతరం భారత అండర్‌-19, అండర్‌-23 జట్లు శ్రీలంక టూర్‌కు వెళ్లనున్నాయి. ఈ పర్యటనలో భాగంగా భార‌త యువ జ‌ట్లు శ్రీలంక అండర్‌-19, లయన్స్ టీమ్స్‌తో నాలుగు రోజుల రెడ్ బాల్ మ్యాచ్‌లు ఆడ‌నున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను  బీసీసీఐ త్వ‌ర‌లోనేఖరారు చేయ‌నుంది.

అయితే శ్రీలంక పర్యటనకు వెళ్లే జట్లను ఎంపిక చేసేందుకు బీసీసీఐ జూన్‌లో ఒక ప్రత్యేక టోర్నమెంట్‌ను  నిర్వహించనుంది. ఇప్ప‌టికే దేశవ్యాప్తంగా 64 మంది యువ ఆటగాళ్లు బోర్డు షార్ట్ లిస్ట్ చేసింది.  వీరింతా ప్ర‌స్తుతం బెంగ‌ళూరులోని బీసీసీఐ ఆఫ్ ఎక్సలెన్స్‌లో శిక్ష‌ణ పొందుతున్నారు.

ఈ యువ ఆట‌గాళ్లు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రాటుదేలుతున్నారు. ఈ టోర్నీలో అత్యుత్తుమ ప్ర‌ద‌ర్శ‌న ఆట‌గాళ్లు శ్రీలంక వెళ్లే విమానం ఎక్క‌నున్నారు. ఐపీఎల్‌-2026లో ఆడుతున్న యంగ్ కిడ్స్ వైభ‌వ్ సూర్య‌వంశీ, అయూశ్ మాత్రే కూడా సీజ‌న్ ముగిసిన త‌ర్వాత ఈ క్యాంప్‌లో చేరనున్నారు.

కెప్టెన్‌గా వైభ‌వ్ సూర్య‌వంశీ?
అయితే శ్రీలంక టూర్‌కు ముందు భారత అండర్‌-19 కెప్టెన్ అయూష్ మాత్రే గాయపడడం సెలక్టర్లు తలనొప్పిగా మారింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కేకు ప్రాతినిథ్యం వహిస్తున్న మాత్రే తొడ కండరాలు (హ్యామ్‌స్ట్రింగ్‌) పట్టేశాయి. దీంతో అతడు వికెట్ల మధ్య పరిగెత్తేందుకు ఇబ్బంది పడ్డాడు. 

అతడు గాయం తీవ్రమైనదిగా తెలుస్తోంది. ఒకవేళ మాత్రే గాయం గ్రేడ్‌-3లో ఉన్న‌ట్ల‌యితే పూర్తిగా కోలుకోవ‌డానికి రెండు నెలల సమయం పడుతోంది. అదే జ‌రిగితే రోహిత్ ఐపీఎల్‌-2026 సీజ‌న్ మ‌ధ్య‌లోనే వైదొలగడంతో పాటు శ్రీలంక పర్యటనకు కూడా మాత్రే దూరమయ్యే అవకాశముంది. మరోవైపు అండర్‌-19 వైస్ కెప్టెన్ వియాన్ మల్హోత్రా కూడా స్వ‌ల్ప గాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. 

వియాన్ మల్హోత్రాను ఐపీఎల్‌-2026 వేలంలో ఆర్సీబీ కొనుగోలు చేసింది. కానీ ఇప్ప‌టివ‌ర‌కు అత‌డు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఒక‌వేళ శ్రీలంక టూర్‌కు మాత్రే, వియాన్ ఇద్ద‌రు అందుబాటులో లేక‌పోతే భార‌త జ‌ట్టు కెప్టెన్‌గా వైభ‌వ్ సూర్య‌వంశీ అవ‌కాశ‌ముంది. సూర్య‌వంశీ గ‌తంలో సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో భార‌త జ‌ట్టు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు. అత‌డి నేతృత్వంలోని యంగ్ ఇండియా ఆ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. మళ్లీ ఇప్పుడు వైభవ్ తన కెప్టెన్సీని నిరూపించుకునే సమయం వచ్చిందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

చదవండి: PSL: పిరికిపందలు.. ఎక్స్‌ట్రాలు వద్దు.. పాక్‌ బోర్డుకు ఘాటు కౌంటర్‌

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)