Breaking News

టెస్టులో సెంచ‌రీ బాదిన వైభ‌వ్ సూర్య‌వంశీ!

Published on Sun, 06/07/2026 - 09:33

15 ఏళ్ల వ‌య‌సులోనే టీమిండియాకు ఎంపికైన బీహార్ చిచ్చ‌ర‌పిడుగు వైభ‌వ్ సూర్య‌వంశీ ప్ర‌స్తుతం క్రికెట్‌లో హాట్‌టాపిక్‌గా మారిపోయాడు. అరంగేట్రంకు ముందే అంత‌ర్జాతీయ రికార్డుల‌న్నీ బ‌ద్ద‌లు కొట్టిన వైభ‌వ్ సూర్య‌వంశీకి సంబంధించిన పాత వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 

టీ20 ఫార్మాట్‌లో టీమిండియాకు ఎంపికైన వైభ‌వ్‌ను ఇప్పుడు టెస్టుల్లోకి కూడా తీసుకుంటే బాగుంటుంద‌ని అభిమానులు పేర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే వైభ‌వ్ సూర్య‌వంశీ అన‌ధికారిక టెస్టు మ్యాచ్‌లో సెంచ‌రీ చేసిన వీడియోనూ ఎక్స్‌లో షేర్ చేసుకున్నారు. 2025 అక్టోబ‌ర్‌లో ఆస్ట్రేలియా అండ‌ర్‌-19 జ‌ట్టుతో భార‌త అండ‌ర్‌-19 జ‌ట్టు బ్రిస్బేన్ వేదిక‌గా యూత్ టెస్టు మ్యాచ్ ఆడింది. 

ఆ మ్యాచ్‌లో వైభ‌వ్ సూర్య‌వంశీ 78 బంతుల్లోనే సెంచ‌రీ సాధించ‌డం విశేషం. అప్ప‌టికే ఐపీఎల్ 18వ సీజ‌న్ ఆడిన వైభ‌వ్ సూర్య‌వంశీ త‌న విధ్వంసాన్ని అన‌ధికారిక టెస్టులోనూ కొన‌సాగించాడు. ఆ మ్యాచ్‌లో 86 బంతుల్లో 113 ప‌రుగులు చేసిన సూర్య‌వంశీ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 8 సిక్స‌ర్లు ఉన్నాయి. వేదాంత్ త్రివేదితో క‌లిసి మూడో వికెట్‌కు 152 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని జ‌త‌చేశాడు. 

అంతేకాదు వైభ‌వ్ విధ్వంసంతో ఆస్ట్రేలియా అండ‌ర్‌-19 జ‌ట్టుతో జ‌రిగిన టెస్టులో భార‌త్ ఇన్నింగ్స్ 58 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. టెస్టులోనూ టీ20 త‌ర‌హా ఆట‌తో విజృంభించిన వైభ‌వ్‌ను సంప్ర‌దాయ క్రికెట్‌లోనూ ఆడించాల‌నే డిమాండ్లు పెరిగిపోయాయి. 

ఐపీఎల్‌కు, అంత‌ర్జాతీయ మ్యాచ్‌ల‌కు చాలా తేడా ఉంటుంద‌ని, మొద‌ట టీ20 ఫార్మాట్‌లో త‌న‌ను తాను నిరూపించుకోవాల‌ని కొంత‌మంది అభిమానులు పేర్కొంటున్నారు. ఇక వైభ‌వ్ సూర్య‌వంశీ ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. సీజ‌న్‌లో 16 మ్యాచ్‌లాడిన వైభ‌వ్ సూర్య‌వంశీ 237 స్ట్రైక్‌రేట్‌తో 776 ప‌రుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచ‌రీ స‌హా ఐదు హాఫ్ సెంచ‌రీలున్నాయి. 

చదవండి: చరిత్ర సృష్టించిన వైశాలీ.. అన్న బాట‌లోనే చెల్లి!

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)