Breaking News

చరిత్ర సృష్టించిన వైభవ్‌ సూర్యవంశీ.. వరల్డ్‌ రికార్డు

Published on Wed, 01/07/2026 - 16:27

భారత అండర్‌-19 స్టార్‌ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ మరోసారి శతక్కొట్టాడు. సౌతాఫ్రికా అండర్‌-19 జట్టుతో బుధవారం నాటి మూడో యూత్‌ వన్డేలో ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇరవై నాలుగు బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న వైభవ్‌.. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించాడు.

ప్రపంచ రికార్డు
కేవలం 63 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. ఈ క్రమంలో వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. యూత్‌ వన్డేల్లో అత్యంత పిన్న వయసులో అతి తక్కువ బంతుల్లోనే సెంచరీ చేసిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. కేవలం పద్నాలుగేళ్ల వయసులోనే ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ ఈ అరుదైన ఫీట్‌ అందుకున్నాడు.

127 పరుగులు
బెనోనీ వేదికగా ఈ మ్యాచ్‌లో మొత్తంగా 74 బంతులు ఎదుర్కొన్న వైభవ్‌ సూర్యవంశీ.. తొమ్మిది ఫోర్లు, పది సిక్స్‌లు బాది 127 పరుగులు సాధించాడు. టాండో సోని బౌలింగ్‌లో జేసన్‌ రోవెల్స్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో వైభవ్‌ విధ్వంసకర శతక ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇక మరో ఓపెనర్‌ ఆరోన్‌ జార్జ్‌ సైతం దుమ్ములేపాడు.

227 పరుగుల భాగస్వామ్యం
ఆరోన్‌తో కలిసి వైభవ్‌.. తొలి వికెట్‌కు ఏక​ంగా 227 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మరోవైపు.. ఆరోన్‌ సైతం శతక్కొట్టాడు. 106 బంతుల్లో 16 ఫోర్లు బాది 118 పరుగులు సాధించి జేసన్‌ రోవెల్స్‌ బౌలింగ్‌లో నిష్క్రమించాడు. 

మిగిలిన వారిలో వన్‌డౌన్‌ బ్యాటర్‌ వేదాంత్‌ త్రివేది 34, అభిజ్ఞాన్‌ కుందు 21 పరుగులు చేయగా.. మొహమద్‌ ఎనాన్‌ 28, హెనిల్‌ పటేల్‌​ 19 పరుగులతో అజేయంగా నిలిచారు. హర్‌వన్ష్‌ పంగాలియా (2), ఆర్‌ఎస్‌ అంబరిష్‌ (8), కనిష్క్‌ చౌహాన్‌ (10) విఫలమయ్యారు. ఫలితంగా భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 393 పరుగులు చేసింది.

కెప్టెన్‌గా మొదటిసారే..
కాగా ఆయుశ్‌ మాత్రే గైర్హాజరీలో సౌతాఫ్రికా పర్యటనలో వైభవ్‌ సూర్యవంశీ తొలిసారిగా భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రాణిస్తూ ఇప్పటికే తొలి రెండు యూత్‌ వన్డేల్లో గెలిచి.. సారథి హోదాలో తొలి సిరీస్‌ను సొంతం చేసుకున్నాడు వైభవ్‌. ఇరుజట్ల మధ్య బుధవారం నాటి నామమాత్రపు మ్యాచ్‌లోనూ భారత్‌ విజయం సాధించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. 

చదవండి: బంగ్లాదేశ్‌కు భారీ షాక్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)