అత‌డిని ఎంత పొగిడినా తక్కువే.. కచ్చితంగా స్టార్ అవుతాడు: శ్రేయస్‌

Published on Mon, 04/20/2026 - 19:39

ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో దూసుకుపోతున్నాడు. ఆదివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కూడా వైభవ్ బ్యాట్ ఝుళిపించాడు. కేవలం 28 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46 పరుగులు చేశాడు.

ఓవరాల్‌గా ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన వైభవ్ సూర్యవంశీ 236.54 స్ట్రైక్ రేట్‌తో 246 పరుగులు చేశాడు. కాగా ఈ యంగ్ కిడ్ బ్యాటింగ్‌కు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫిదా అయిపోయాడు. వైభవ్ ఒక ఫ్యూచర్ స్టార్ అని శ్రేయస్ కొనియాడాడు.

వైభవ్ సూర్యవంశీ ఒక భిన్నమైన ఆటగాడు. అతడి వద్ద అద్బుతమైన టాలెంట్ ఉంది. అతడిని ఎంత పొగిడినా తక్కువే. అతడి బ్యాట్ ఫ్లో, బంతి పడకముందే అతను సృష్టించుకునే రిథమ్, మొమెంటం అద్భుతం. కచ్చితంగా అతడు కచ్చితంగా భవిష్యత్ స్టార్ అవుతాడనే చెప్పాలి" అని జియోస్టార్ నిర్వహించిన 'బిలీవ్' కార్యక్రమంలో అయ్యర్ పేర్కొన్నాడు.

ఇక ఈ ఏడాది సీజన్‌లో శ్రేయస్ అయ్యర్ కూడా కెప్టెన్‌, బ్యాటర్‌గా అదరగొడుతున్నాడు.  శ్రేయస్ ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడి 208 పరుగులు సాధించాడు. అతడి కెప్టెన్సీలో పంజాబ్ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది.
చదవండి: NZ vs BAN 2nd ODI: న్యూజిలాండ్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్‌

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)