నేపాల్‌తో చారిత్రక క్రికెట్‌ సిరీస్‌.. వైభవ్‌కు ప్రమోషన్‌!

Published on Fri, 07/10/2026 - 15:17

నేపాల్‌తో క్రికెట్ బంధాన్ని పెంచుకునే క్రమంలో బీసీసీఐ మరో కీలక అడుగు వేయనుంది. సమీప భవిష్యత్తులో భారత జట్టు క్రికెట్ సిరీస్ ఆడేందుకు నేపాల్‌కు పంపించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఒక ప్రకటన విడుదల చేశారు. భౌగోళిక రాజకీ యాల్లో ఇరు దేశాల మధ్య ఉన్న బంధం చారిత్రక క్రికెట్‌ సిరీస్‌ నిర్వహణతో మరింత బలపడనుంది. అయితే నేపాల్‌ పర్యటనకు సీనియర్‌ జట్టును కాకుండా ఇండియా-ఏ జట్టును పంపించనున్నట్లు దేవజిత్ స్పష్టం చేశారు.

అయితే నేపాల్‌తో ఆడబోయే సిరీస్ ఏ ఫార్మాట్‌లో నిర్వహించాలనేది త్వరలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక ఈ సిరీస్‌కు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని పంపే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. అవసరమైతే ఇండియా-ఏ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను వైభవ్‌కు అప్పగించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం.

ఇప్పటికైతే తిలక్ వర్మ ఇండియా-ఏ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అతడికి విశ్రాంతినిచ్చి వైభవ్‌ను కెప్టెన్ హోదాలో నేపాల్‌కు పంపే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. చిన్న వయసులోనే టీమిండియాకు ఎంపికైన వైభవ్‌ ఆటలో ఇంకా ఎంతో  మెరుగుపడాల్సిన అవసరం ఉందని బీసీసీఐ భావిస్తోంది.

ఇటీవల సంవత్సరాల్లో ఆసియా దేశాల నుంచి క్రికెట్‌లో అడుగుపెట్టిన దేశాల్లో నేపాల్ మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఆటలో పురోగతి సాధించడం ద్వారా నేపాల్ జట్టు వరుసగా 2024తో పాటు 2026 టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. 2024 టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాప్రికాకు ఓడించినంత పని చేసిన నేపాల్‌.. 2026 టీ20 ప్రపంచకప్‌లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్‌ను కూడా ఓడించినంత పని చేసింది. 

చివరకు ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ నాలుగు పరుగుల తేడాతో గట్టెక్కింది. ఇక ఇదే ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌పై విజయంతో నేపాల్‌ మెగా టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. ఐర్లాండ్ టూర్‌కు ఎంపికైనప్పటికీ వైభవ్ సూర్యవంశీకి ఆ సిరీస్‌లో ఆడే అవకాశం రాలేదు. అయితే ఇంగ్లండ్ టూర్‌లో మాత్రం తొలి టీ20 మినహా మిగతా అన్న్ని మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం వచ్చినప్పటికీ వైభవ్ రాణించడంలో విఫలమయ్యాడు. 

మూడు మ్యాచ్‌లు కలిపి వైభవ్ 42 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్‌తో పాటు లంకలో జరిగిన ట్రై సిరీస్‌లో పరుగుల పండుగ చేసుకున్న వైభవ్ సూర్యవంశీ ఇంగ్లండ్ గడ్డపై మాత్రం పూర్తిగా తేలిపోతున్నాడు.

 

చదవండి: ‘శ్రేయస్‌ను నిందించొద్దు.. అదే అసలు సమస్య’

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)