Breaking News

వైభవ్ సూర్యవంశీకి అదిరిపోయే బహుమతి

Published on Mon, 11/09/2026 - 12:26

పట్నా: భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీకి మ‌రో బ‌హుమ‌తి ద‌క్కింది. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో బ్యాట్‌తో అద‌ర‌గొట్టిన వైభవ్‌.. టాటా సియెర్రా ఎస్‌యూవీ కారును ఇప్పుడు అందుకున్నాడు. ఐపీఎల్‌ 2026లో అద్భుత ప్రదర్శనతో ‘సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్’ అవార్డు గెలుచుకోవ‌డంతో అత‌డికి ఈ కారు సొంత‌మైంది.

ఇటీవల వైభవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప‌ట్నాలోని టాటా షోరూమ్‌కు వెళ్లి, కొత్త టాటా సియెర్రా కారును అందుకున్నాడు. తల్లిదండ్రులు, సోదరులతో కలిసి పసుపు రంగు సియెర్రా ఎస్‌యూవీ ముందు దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఐపీఎల్‌ 2026లో టాప్ స్కోర‌ర్‌
వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది ఐపీఎల్ సీజ‌న్‌లో అత్య‌ధిక ప‌రుగుల‌తో ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్న సంగ‌తి తెలిసిందే. 16 మ్యాచ్‌లు ఆడిన ఈ బిహార్ యువ క్రికెట‌ర్  ఐదు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీతో 776 పరుగులు సాధించి టోర్నీ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో 63 ఫోర్లు, 72 సిక్సర్లు ఉండ‌డం విశేషం.

చిన్న వ‌య‌సులో కెప్టెన్సీ రికార్డు
15 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేసిన వైభవ్ సూర్యవంశీ ఖాతాలో తాజాగా మ‌రో రికార్డు కూడా చేరింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బిహార్ పురుషుల సీనియర్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక‌య్యాడు. పిన్న వ‌య‌సులోనే ఈ ఘ‌న‌త సాధించిన క్రికెట‌ర్‌గా అత‌డు చ‌రిత్ర సృష్టించాడు. అంతేకాదు అతిచిన్న వ‌య‌సులో టీ20 క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన ఆట‌గాడిగా ప్రపంచ రికార్డు లిఖించాడు. 

ఇదీ చ‌ద‌వండి: వైభవ్‌ సూర్యవంశీ ప్రపంచ రికార్డు

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)