Breaking News

హీరో అవ్వాలని చూడకు.. బ్రెయిన్‌ వాడు: బుమ్రాకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

Published on Tue, 08/29/2023 - 15:48

Don’t try to be a hero from day one Bumrah: ‘‘అత్యుత్తమైన ఫాస్ట్‌ బౌలర్లలో జస్‌ప్రీత్‌ బుమ్రా ఒకడన్న సంగతి అందరికీ తెలిసిందే. బుమ్రా తనదైన శైలిలో బౌలింగ్‌లో చెలరేగుతుంటే చూడాలని ప్రతి ఒక్క క్రికెట్‌ ప్రేమికుడు కోరుకుంటాడు. అయితే, నా అభిప్రాయం ప్రకారం.. ఇప్పుడిప్పుడే గాయం నుంచి పూర్తిగా కోలుకుంటున్న బుమ్రా తొందరపడకూడదు.

బ్రెయిన్‌ వాడు బుమ్రా
తన అనుభవాన్ని రంగరించి.. తెలివిగా బౌలింగ్‌ చేస్తూ శారీరక శ్రమను ఎంత వీలైతే అంత తగ్గించుకోవాలి. మెదడునే ఎక్కువగా ఉపయోగించాలి. మైదానంలో దిగిన తొలిరోజు నుంచే హీరో అవ్వాలనే తాపత్రయం తగదు.

మరీ దూకుడుగా ఆడాలని చూస్తే గాయం తిరగబెట్టే అవకాశం ఉంది. ముందు పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్‌ సాధించాలి. ఆ తర్వాతే శరీరాన్ని కష్టపెట్టినా పెద్దగా చింతించాల్సిన అవసరం ఉండదు. నేనైతే బుమ్రాకు ఇచ్చే ప్రధాన సలహా ఇదే’’ అని సౌతాఫ్రికా మాజీ పేసర్‌ మఖాయ ఎన్తిని అన్నాడు.

ఐర్లాండ్‌ పర్యటనలో కెప్టెన్‌గా రీఎంట్రీ
వెన్నునొప్పి నుంచి కోలుకుని మైదానంలో దిగుతున్న టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాను ఉద్దేశించి ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశాడు. గతేడాది సెప్టెంబరులో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ సందర్భంగా వెన్నునొప్పి తిరగబెట్టడంతో జట్టుకు దూరమైన ఈ పేసుగుర్రం.. సుమారు పదకొండు నెలల విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు.


PC: BCCI

ఆరంభంలోనే రెచ్చిపోయిన బుమ్రా
ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి జట్టుకు విజయం అందించాడు. ఇక ఐరిష్‌ జట్టుపై తొలి మ్యాచ్‌ నుంచే రెచ్చిపోయిన బుమ్రా.. తన బౌలింగ్‌ నైపుణ్యాలతో ఆకట్టుకున్నాడు. 

పునరాగమనంలో రెండు మ్యాచ్‌లలో వరుసగా 2, 2 వికెట్లు పడగొట్టాడు. ఇక అప్పటికే సిరీస్‌ గెలిచిన టీమిండియా వర్షం అంతరాయం కారణంగా మ్యాచ్‌ రద్దు కావడంతో మూడో టీ20 ఆడలేకపోయింది. ఇదిలా ఉంటే.. ఐర్లాండ్‌ పర్యటన ముగిసిన తర్వాత బుమ్రా.. ఆసియా కప్‌-2023 బరిలో దిగనున్నాడు.

పాకిస్తాన్‌తో టీమిండియా తొలి మ్యాచ్‌
పాకిస్తాన్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ వన్డే టోర్నీ ఆగష్టు 30న ఆరంభం కానుంది. ఈ క్రమంలో సెప్టెంబరు 2న తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ నేపథ్యంలో రెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడిన మఖాయ ఎన్తినికి బుమ్రా గురించి ప్రశ్న ఎదురైంది.

అలా అయితే మొదటికే మోసం
ఇందుకు బదులుగా ఎన్తిని పైవిధంగా స్పందించాడు. ఇప్పటి నుంచి బుమ్రా మరింత జాగ్రత్తగా ఉండాలని.. మళ్లీ గాయం బారిన పడితే మొదటికే మోసం వస్తుందని పేర్కొన్నాడు. బుమ్రా తన శరీరం కంటే కూడా మెదడునే బాగా ఉపయోగించాలని 46 ఏళ్ల ఎన్తిని సలహా ఇచ్చాడు. 

చదవండి: WC 2023: వరల్డ్‌కప్‌ జట్టులో సంజూకు ఛాన్స్‌! వాళ్లిద్దరికీ షాక్‌.. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)