Breaking News

'లక్ష్యం చిన్నదే.. రేపు ఏమైనా జరగొచ్చు!'

Published on Thu, 03/02/2023 - 20:04

ఇండోర్‌ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మొదలైన మూడో టెస్టు తుది అంకానికి చేరుకుంది. ఈ మ్యాచ్‌ కూడా తొలి రెండు టెస్టుల్లాగే మూడో రోజునే ముగిసిపోయే అవకాశం ఉంది. రెండో రోజు ఆటలో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 163 పరుగులకే ఆలౌట్‌ కావడంతో ఆసీస్‌ ముందు 76 పరుగుల స్వల్ప టార్గెట్‌ మాత్రమే ఉంది. నాథన్‌ లియోన్‌ రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు పడగొట్టి టీమిండియా పతనాన్ని శాసించాడు. ఇక  ఏదైనా అద్బుతం జరిగితే తప్ప ఆసీస్‌ జట్టు గెలుపు లాంచనమే. అయితే టీమిండియా పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ మాత్రం టీమిండియా విజయంపై ధీమా వ్యక్తం చేశాడు.

''క్రికెట్‌లో ఏదైనా జరగొచ్చు. టార్గెట్‌ 76 పరుగులే కావొచ్చు.. కానీ రేపు(మూడోరోజు ఆటలో) ఏమైనా జరగొచ్చు. టైట్‌ బౌలింగ్‌ వేయడానికి ప్రయత్నిస్తాం. ఇండోర్‌ పిచ్‌ అంత ఈజీ వికెట్‌ మాత్రం కాదు. ఈ వికెట్‌ మా జట్టు బ్యాటర్లు కావొచ్చు.. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లు అయినా సరే బ్యాటింగ్‌ చేయడం మాత్రం కష్టం. అందునా స్కోరు తక్కువ ఉంది కదా అని హిట్టింగ్‌ ఆడే ప్రయత్నం చేస్తే మొదటికే మోసం వస్తుంది. బంతి మాత్రం వికెట్‌కు చాలా తక్కువ ఎత్తులో వెళుతుంది.. ఇది బ్యాటర్లను ఇబ్బంది పెట్టొచ్చు. వారికి టార్గెట్‌ చిన్నదే కావొచ్చు.. ఫలితం అనుకూలంగా వచ్చేందుకు మేం చేయాల్సింది చేస్తాం'' అంటూ చెప్పుకొచ్చాడు. 

ఇక ఉమేశ్‌ యాదవ్‌ ఈ మధ్య కాలంలో టీమిండియాకు టెస్టులకు మాత్రమే పరిమితమ్యాడు. జట్టుకు ఎంపిక అవుతున్నప్పటికి తుదిజట్టులో అవకాశం చాలా తక్కువగానే వస్తోంది. తాజాగా షమీకి రెస్ట్‌ ఇవ్వడంతో ఉమేశ్‌ తుది జట్టులోకి వచ్చాడు. తన బౌలింగ్‌తో ఆకట్టుకున్న ఉమేశ్‌ యాదవ్‌ మూడు వికెట్లు పడగొట్టి టీమిండియాకు బ్రేక్‌ ఇచ్చాడు.

ఇటీవలే తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఉమేశ్‌ బౌలింగ్‌లో అదరగొట్టడం అతనికి కాస్త ఊరటనిచ్చే అంశం అని చెప్పొచ్చు. మ్యాచ్‌లో మిచెల్‌ స్టార్క్‌ వికెట్‌ తీయడం ద్వారా ఉమేశ్‌ స్వదేశంలో టెస్టుల్లో వంద వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఓవరాల్‌గా 54 టెస్టుల్లో 165 వికెట్లు, 75 వన్డేల్లో 106 వికెట్లు, 9 టి20ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. 

చదవండి: తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉండి కూడా నిప్పులు చెరిగిన ఉమేశ్‌ 

మెస్సీనా మజాకా.. జట్టు కోసం గోల్డ్‌-ఐఫోన్స్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)