Breaking News

న‌ట‌రాజన్ సిక్స‌ర్లు వృథా; టీమిండియాకు షాకిచ్చిన యూఏఈ

Published on Sat, 10/31/2026 - 09:31

హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో టీమిండియాకు ఏదీ కలిసిరావడం లేదు. టోర్నీలో భారత్‌ వ‌రుస‌గా రెండో ప‌రాజ‌యాన్ని మూటగ‌ట్టుకుంది. శుక్రవారం పాకిస్తాన్‌తో ఓట‌మి మ‌రిచిపోక‌ముందే ఈసారి యూఏఈ జ‌ట్టు భార‌త్‌కు ఊహించ‌ని షాక్ ఇచ్చింది. గ్రూప్‌-సిలో భాగంగా శ‌నివారం జ‌రిగిన మ్యాచ్‌లో యూఏఈత చేతిలో భార‌త్ 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. 

తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ 6 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 94 ప‌రుగులు చేసింది. యార్క‌ర్ల స్పెష‌లిస్ట్ న‌ట‌రాజ‌న్ (14 బంతుల్లో 38; 3 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా, రాహుల్ త్రిపాఠి (7 బంతుల్లో 24) ప‌ర్వాలేద‌నిపించాడు. యూఏఈ బౌల‌ర్ల‌లో జాహిద్ అలీ మూడు వికెట్లు తీయ‌గా, ముహ‌మ్మ‌ద్ ఫ‌రూక్, మొహ‌మ్మ‌ద్ ఫ‌రాజుద్దీన్ చెరొక వికెట్ ప‌డ‌గొట్టారు. 

అనంత‌రం బ్యాటింగ్ చేసిన యూఏఈ 4.2 ఓవ‌ర్ల‌లోనే వికెట్ న‌ష్ట‌పోకుండా 97 ప‌రుగులు చేసి ఘ‌న విజ‌యాన్ని  అందుకుంది. ఖాలిద్ షా (14 బంతుల్లో 52; 3 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగగా, అన్ష్ టాండ‌న్ (12 బంతుల్లో 39 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 

గ్రూప్ ద‌శ‌లో రెండు ఓట‌ముల‌తో  గ్రూప్‌-సి ప‌ట్టిక‌లో ఆఖ‌రి స్థానంలో నిలిచిన భార‌త్ ప్లేట్ సెమీస్ ఆడ‌నుంది. ప్లేట్ సెమీఫైన‌ల్‌లో ఇంగ్లండ్‌తో భార‌త్ అమీతుమీకి సిద్ధ‌మైంది. 

 

ఇదీ చదవండి: ఆసీస్‌ టార్గెట్‌ 288.. చ‌రిత్ర సృష్టించిన సౌతాఫ్రికా బ్యాట‌ర్లు

 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)