Breaking News

టీ20 ప్రపంచకప్‌: భారత్‌తో పాటు సెమీస్‌ చేరిన జట్లు ఇవే.. షెడ్యూల్‌

Published on Tue, 01/28/2025 - 09:04

మహిళల అండర్‌–19 టీ20 ప్రపంచకప్‌(ICC Under 19 Womens T20 World Cup 2025)లో చివరిదైన నాలుగో సెమీఫైనల్‌ బెర్త్‌ ఇంగ్లండ్‌ జట్టు దక్కించుకుంది. న్యూజిలాండ్‌ జట్టుతో సోమవారం జరిగిన ‘సూపర్‌ సిక్స్‌’ గ్రూప్‌–2 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

రన్‌రేట్‌ పరంగా వెనుకబడినా..
ఇక ఇప్పటికే ‘సూపర్‌ సిక్స్‌’ గ్రూప్‌–1 నుంచి భారత్(India), ఆస్ట్రేలియా(Australia)... గ్రూప్‌–2 నుంచి దక్షిణాఫ్రికా(South Africa) సెమీఫైనల్‌ చేరుకున్నాయి. కాగా గ్రూప్‌–2లో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ జట్లు ఆరు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే మెరుగైన రన్‌రేట్‌ కారణంగా దక్షిణాఫ్రికా గ్రూప్‌ ‘టాపర్‌’గా ఉంది. 

మరోవైపు.. న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్‌ గెలుపొందడంతో నైజీరియా సెమీఫైనల్‌ అవకాశాలకు తెరపడింది. ఈనెల 29న ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో నైజీరియా గెలిచినా ఐదు పాయింట్లకే పరిమితం అవుతుంది.

40 పరుగుల తేడాలో పది వికెట్లు
ఇక మ్యాచ్‌ విషయానికొస్తే... మలేషియాలోని కుచింగ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 89 పరుగులకు ఆలౌటైంది. ఒకదశలో 49/0తో పటిష్టంగా కనిపించిన న్యూజిలాండ్‌ను ఇంగ్లండ్‌ బౌలర్లు టిల్లీ కోర్టిన్‌ కోల్మన్‌ (4/8), ప్రిషా థానావాలా (3/19), ట్రూడీ జాన్సన్‌ (2/7) దెబ్బ కొట్టారు.

ఫలితంగా న్యూజిలాండ్‌ 40 పరుగుల తేడాలో 10 వికెట్లను కోల్పోయింది. ఓపెనర్లు కేట్‌ ఇర్విన్‌(26 బంతుల్లో 35; 2 ఫోర్లు, 1 సిక్స్‌), ఎమ్మా మెక్లాయిడ్‌ (31 బంతుల్లో 18) మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. మిగతా బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు.

అనంతరం ఇంగ్లండ్‌ జట్టు 11.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసి గెలిచింది. డావినా పెరిన్‌ (15 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్‌), జెమీమా స్పెన్స్‌ (18 బంతుల్లో 29; 5 ఫోర్లు), చార్లోటి స్టబ్స్‌ (15 బంతుల్లో 17 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు.   

మహిళల అండర్‌–19 టీ20 ప్రపంచకప్‌-2025లో సెమీస్‌ చేరిన జట్లు ఇవే
👉గ్రూప్‌-1: భారత్‌, ఆస్ట్రేలియా
👉గ్రూప్‌-2: దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌

సెమీ ఫైనల్‌, ఫైనల్‌ షెడ్యూల్‌ ఇదే
మహిళల అండర్‌–19 టీ20 ప్రపంచకప్‌-2025 టోర్నీలో జనవరి 31న సెమీ ఫైనల్‌-1 జరుగనుంది. కౌలలంపూర్‌లోని బేయుమస్‌ ఓవల్‌ మైదానం ఇందుకు వేదిక. భారత కాలమానం ప్రకారం ఉదయం 8 గంటలకు ఈ మ్యాచ్‌ ఆరంభమవుతుంది.

ఇక రెండో సెమీ ఫైనల్‌ కూడా అదే రోజు అదే వేదికపై మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. ఇదిలా ఉంటే.. ఫైనల్‌ మ్యాచ్‌ ఫిబ్రవరి 2న మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభం కానుంది. ఇక ఈమ్యాచ్‌లను జియోస్టార్‌, స్టార్‌  స్పోర్ట్స్‌-2 లో వీక్షించవచ్చు

భారత్‌, ఆసీస్‌, దక్షిణాఫ్రికా సెమీస్‌ చేరాయిలా..
కౌలాలంపూర్‌: అండర్‌–19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో లీగ్‌ దశలో అజేయంగా నిలిచిన టీమిండియా... ‘సూపర్‌ సిక్స్‌’ గ్రూప్‌–1 తొలి మ్యాచ్‌లోనూ గెలిచింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాకు తగ్గట్టు ఆడుతున్న భారత అమ్మాయిల జట్టు  సెమీఫైనల్‌ బెర్త్‌ను ఆదివారం ఖరారు చేసుకుంది.  బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో నికీ ప్రసాద్‌ సారథ్యంలోని భారత జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

టాస్‌ గెలిచిన భారత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు కేవలం 64 పరుగులు మాత్రమే చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఎడంచేతి వాటం స్పిన్నర్‌ వైష్ణవి శర్మ 4 ఓవర్లలో 15 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్‌ను కట్టడి చేసింది.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పేస్‌ బౌలర్‌ షబ్నమ్, జోషిత, తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష ఒక్కో వికెట్‌ తీసుకున్నారు. బంగ్లాదేశ్‌ బ్యాటర్లలో జన్నతుల్‌ మవువా (20 బంతుల్లో 14), కెప్టెన్‌ సుమయ అక్తర్‌ (29 బంతుల్లో 21 నాటౌట్‌; 1 ఫోర్‌) మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌ కారణంగా బంగ్లాదేశ్‌ బ్యాటర్లు ఇన్నింగ్స్‌ మొత్తంలో ఒక్క 
బౌండరీ మాత్రమే కొట్టడం గమనార్హం.

ఇక 65 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆడుతూ పాడుతూ విజయతీరానికి చేరింది. 7.1 ఓవర్లలో భారత జట్టు 2 వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్‌ గొంగడి త్రిష (31 బంతుల్లో 40; 8 ఫోర్లు) దూకుడుగా ఆడింది. త్రిష చేసిన 40 పరుగుల్లో 32 పరుగులు బౌండరీల ద్వారానే రావడం విశేషం.

మరో ఓపెనర్‌ కమలిని (5) తక్కువ స్కోరుకే అవుటైనా... సనికా చాల్కె (5 బంతుల్లో 11 నాటౌట్‌; 2 ఫోర్లు), నికీ ప్రసాద్‌ (2 బంతుల్లో 5 నాటౌట్‌; 1 ఫోర్‌) మిగతా  లాంఛనాన్ని పూర్తి చేశారు. వైష్ణవికి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. మంగళవారం జరిగే తమ చివరి ‘సూపర్‌ సిక్స్‌’ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌తో భారత్‌ ఆడుతుంది.  

ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలకు సెమీస్‌ బెర్తు
మరోవైపు ‘సూపర్‌ సిక్స్‌’ గ్రూప్‌–1 నుంచి ఆస్ట్రేలియా కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఇదే గ్రూప్‌లో శ్రీలంక, స్కాట్లాండ్‌ జట్ల మధ్య ఆదివారమే జరగాల్సిన ‘సూపర్‌ సిక్స్‌’ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో ఆస్ట్రేలియాకు సెమీఫైనల్‌ బెర్త్‌ దక్కింది. 

ప్రస్తుతం ‘సూపర్‌ సిక్స్‌8 గ్రూప్‌–1లో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఆరు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉండగా ... శ్రీలంక మూడు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.

ఈనెల 29న ఆస్ట్రేలియాతో జరిగే తమ చివరి ‘సూపర్‌ సిక్స్‌’ మ్యాచ్‌లో శ్రీలంక గెలిచినా ఐదు పాయింట్లకే పరిమితం అవుతుంది. ‘సూపర్‌ సిక్స్‌’ గ్రూప్‌–2 నుంచి దక్షిణాఫ్రికా జట్టు కూడా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. 

చదవండి: చరిత్ర సృష్టించిన ఆసీస్‌ యువ ఓపెనర్‌.. టీ20 ఫైనల్స్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ

Videos

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)