Breaking News

నితీశ్‌ రెడ్డి సెంచరీ.. అయ్యో పాపం!

Published on Mon, 01/19/2026 - 09:20

ఐసీసీ అండర్‌–19 వన్డే ప్రపంచకప్‌లో సుదిని నితీశ్‌ రెడ్డి (133 బంతుల్లో 117 నాటౌట్, 12 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీతో చెలరేగాడు. యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా (యూఎస్‌ఏ) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ తెలుగు సంతతి కుర్రాడు... అండర్‌–19లో అమెరికా తరఫున సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 

జింబాబ్వేలోని బులవాయో వేదికగా వరల్డ్‌కప్‌ గ్రూప్‌ ‘బి’లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో నితీశ్‌ సత్తా చాటాడు. అయితే వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ రద్దు అయింది. 

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన అమెరికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. నితీశ్‌ ఒంటరి పోరాటంతో జట్టుకు మంచి స్కోరు అందించగా... శివ్‌ శని (33), అదిత్‌ (40) ఫర్వాలేదనిపించారు. 

అంతా మనోళ్లే 
అమెరికా జట్టులోని పదకొండు మంది ప్లేయర్లు భారత సంతతి ఆటగాళ్లే కాగా... కెప్టెన్‌ ఉత్కర్ష్‌  శ్రీవాస్తవ (0), సాహిల్‌ గార్గ్‌ (9), అమరిందర్‌ గిల్‌ (10), అదిత్‌ (6), అమోఘ్‌ రెడ్డి ఆరెపల్లి (0) విఫలమయ్యారు. 

మ్యాచ్‌ రద్దు
న్యూజిలాండ్‌ బౌలర్లలో ఫ్లిన్‌ మోరె 4, మాసన్‌ క్లార్క్‌ 3 వికెట్లు పడగొట్టారు. లక్ష్యఛేదనలో న్యూజిలాండ్‌ 1 ఓవర్‌లో వికెట్‌ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. ఈ దశలో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. వరుణుడు ఎంతకూ శాంతించకపోవడంతో పలుమార్లు పరిశీలించిన అనంతరం అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.    

చదవండి: అతడు అద్భుతం.. నితీశ్‌ రెడ్డిని అందుకే ఆడిస్తున్నాం: గిల్‌

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)