Breaking News

World Cup 2026: పాకిస్తాన్‌కు భారీ షాక్‌!

Published on Sat, 01/31/2026 - 09:30

పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌తో కీలక మ్యాచ్‌కు ముందు వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మహ్మద్‌ షయాన్‌ గాయపడ్డాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా ప్రపంచకప్‌ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు అతడు దూరమయ్యాడు.

మూడు బెర్తులు ఖరారు
జింబాబ్వే వేదికగా ఐసీసీ అండర్‌-19 వరల్డ్‌కప్‌-2026 టోర్నీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే సూపర్‌ సిక్స్‌ దశలో గ్రూప్‌-1 నుంచి ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్‌.. గ్రూప్‌-2 నుంచి ఇంగ్లండ్‌ సెమీ ఫైనల్‌కు అర్హత సాధించాయి.

నాలుగో జట్టు ఏది?
ఇక నాలుగో బెర్తు కోసం చిరకాల ప్రత్యర్థులు భారత్‌- పాకిస్తాన్‌  మధ్య ఆదివారం బులవాయో వేదికగా మ్యాచ్‌ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. ఇప్పటికి ఆడిన మూడింటికి మూడు మ్యాచ్‌లలో గెలిచి భారత యువ జట్టు ఆరు పాయింట్లు సాధించగా.. పాక్‌ మూడింట రెండు గెలిచి నాలుగు పాయింట్లతో ఉంది.

ముక్కుకు గాయం
ఇక నెట్‌రన్‌రేటు పరంగానూ భారత్‌ (+3.337) పాకిస్తాన్‌ కంటే (+1.484) మెరుగైన స్థితిలో ఉంది. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్‌కు భారీ షాక్‌ తగిలింది. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మహ్మద్‌ షయాన్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో గాయపడ్డాడు. ఫాస్ట్‌బౌలర్‌ వేసిన బంతి కారణంగా అతడి ముక్కుకు గాయమైంది. 

ఆస్పత్రికి తరలించి స్కానింగ్‌ చేయించగా ఫ్రాక్చర్‌ ఉన్నట్లు తేలింది. ఇందుకు సంబంధించి పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది. 

సచిన్‌ సూచనలు
మరోవైపు.. హ్యాట్రిక్‌ విజయాలతో జోరు మీదున్న భారత్‌.. పాక్‌తో కీలక సమరానికి ముందు టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌తో వర్చువల్‌గా భేటీ అయింది. ఆన్‌లైన్‌లో యువ ఆటగాళ్లను పలకరించిన సచిన్‌.. ఆటకు సంబంధించిన టెక్నిక్స్‌తో పాటు క్రమశిక్షణ, అంకితభావం గురించి మాట్లాడుతూ వారిలో స్ఫూర్తి నింపాడు. 

చదవండి: భారీ శతకం బాదిన ఆఫ్ఘనిస్తాన్‌ బ్యాటర్‌.. ట్రోలింగ్‌ కూడా భారీగానే..!

Videos

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)