Breaking News

World Cup 2026: టీమిండియా భారీ స్కోర్‌

Published on Tue, 01/27/2026 - 17:21

జింబాబ్వే, నమీబియా వేదికగా జరుగుతున్న అండర్‌ 19 ప్రపంచకప్‌-2026లో ఇవాళ (జనవరి 27) యంగ్‌ ఇండియా మ్యాచ్‌ జరుగుతుంది. బులవాయోలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్‌, ఆతిథ్య జింబాబ్వేతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా భారీ స్కోర్‌ (352-8) చేసింది.

మిడిలార్డర్‌ బ్యాటర్‌ విహాన్‌ మల్హోత్రా బాధ్యతాయుతమైన సెంచరీతో (107 బంతుల్లో 109 నాటౌట్‌; 7 ఫోర్లు) చెలరేగగా.. చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ (30 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) తన సహజ శైలిలో మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. మరో మిడిలార్డర్‌ బ్యాటర్‌, వికెట్‌ కీపర్‌ అభిగ్యాన్‌ కుందు (62 బంతుల్లో 61; 5 ఫోర్లు, సిక్స్‌) సెంచరీ వీరుడు విహాన్‌కు సహకరించాడు.

ఆఖర్లో ఖిలన్‌ పటేల్‌ (12 బంతుల్లో 30; ఫోర్‌, 3 సిక్సర్లు) బ్యాట్‌ ఝులిపించడంతో భారత్‌ 350 పరుగుల మార్కును దాటింది. మిగతా ఆటగాళ్లలో ఆరోన్‌ జార్జ్‌ 23, కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే 21, వేదాంత్‌ త్రివేది 15, కనిష్క్‌ చౌహాన్‌ 3, అంబ్రిష్‌ 21, హెనిల్‌ పటేల్‌ 2 (నాటౌట్‌) పరుగులు చేశారు. 

జింబాబ్వే బౌలర్లలో టటెండ చిముగోరో 3 వికెట్లు పడగొట్టగా.. పనాషే మజాయ్‌, కెప్టెన్‌ సింబరాషే మడ్జెంగెరె తలో 2, ధృవ్‌ పటేల్‌ ఓ వికెట్‌ తీశారు.

కాగా, గ్రూప్‌ దశలో భారత్‌ వరుసగా యూఎస్‌ఏ, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ​్‌పై విజయాలు సాధించి సూపర్‌ సిక్స్‌లోకి ప్రవేశించింది. సూపర్‌ సిక్స్‌లో భాగంగానే భారత్‌ జింబాబ్వేతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌ తర్వాత భారత్‌ దాయాది పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. ఫిబ్రవరి 1న బులవాయో వేదికగా ఈ మ్యాచ్‌ జరుగనుంది.

 

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)