Breaking News

'ఆటగదరా శివ!'.. పుజారా ఎమోషనల్‌ పోస్ట్‌

Published on Sun, 06/25/2023 - 07:28

వెస్టిండీస్‌తో వచ్చే నెలలో జరగనున్న టెస్టు సిరీస్‌కు టీమిండియా టెస్టు స్పెషలిస్ట్‌ చతేశ్వర్‌ పుజారాను ఎంపిక చేయలేదన్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా ఫామ్‌లో లేక సతమతమవుతున్న పుజారా ఇటీవలే డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ ఆకట్టుకోలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 41 పరుగులు మాత్రమే చేసి విఫలమైన పుజారాపై వేటు పడింది. 35 ఏళ్ల వయసున్న పుజారా కెరీర్‌కు ముగింపు పడినట్లే అని సోషల్‌ మీడియాలో హోరెత్తింది.

అయితే పుజారాను తప్పించడంపై భారత్‌ క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ తప్పుబట్టాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో రహానే మినహా మిగతా బ్యాటర్లు ఏం వెలగబెట్టారని.. వారిని కూడా తప్పించాల్సింది పోయి కేవలం పుజారాను బలిపశువును చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది అభిమానులు కూడా పుజారాకు మద్దతుగా నిలుస్తూ.. ''అతని ఆట ముగిసిపోలేదు.. మళ్లీ కమ్‌బ్యాక్‌ ఇచ్చే అవకాశం ఉంది.. మరో రెండేళ్లు అతనిలో క్రికెట్‌ ఆడే సత్తా ఉంది.'' అంటూ చెప్పుకొచ్చారు.

అయితే విండీస్‌ టూర్‌కు తనను ఎంపిక చేయకపోవడంపై పుజారా పెద్దగా స్పందించలేదు. కానీ శనివారం సాయంత్రం ట్విటర్‌ వేదికగా ఒక వీడియోనూ షేర్‌ చేస్తూ బ్యాట్‌, బంతితో పాటు లవ్‌ ఎమోజీ పెట్టాడు. తన ఆట అయిపోలేదని.. మళ్లీ కమ్‌బ్యాక్‌ ఇస్తానంటూ ప్రాక్టీస్‌ చేస్తున్నట్లుగా ఎమోషనల్‌ పోస్టు ద్వారా చెప్పకనే చెప్పాడు. పుజారా పెట్టిన పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: కెరీర్‌ ముగిసినట్లే! ..'కొత్త గోడ'కు సమయం ఆసన్నం

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)