Breaking News

ఐదో వన్డేలో ఆసీస్‌ విజయం.. సిరీస్‌ కైవసం

Published on Mon, 09/30/2024 - 07:06

ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-2 తేడాతో కైవసం చేసుకుంది. నిన్న (సెప్టెంబర్‌ 29) జరిగిన నిర్ణయాత్మక ఐదో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో 49 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 49.2 ఓవర్లలో 309 పరుగులకు ఆలౌటైంది. 

ఛేదనలో ఆస్ట్రేలియా స్కోర్‌ 165/2 (20.4 ఓవర్లు) వద్ద ఉండగా వర్షం ప్రారంభమైంది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిన ఆస్ట్రేలియాను విజేతగా ప్రకటించారు. మ్యాచ్‌ ఆగిపోయే సమయానికి ఆస్ట్రేలియా స్కోర్‌ ఇంగ్లండ్‌ స్కోర్‌ కంటే మెరుగ్గా ఉంది.

డకెట్‌ సెంచరీ
ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో బెన్‌ డకెట్‌ (91 బంతుల్లో 107; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు సెంచరీతో కదంతొక్కాడు. హ్యారీ బ్రూక్‌ (52 బంతుల్లో 72; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), ఫిలిప్‌ సాల్ట్‌ (27 బంతుల్లో 45; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్‌లతో అలరించారు. 

విల్‌ జాక్స్‌ (0), జేమీ స్మిత్‌ (6), లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (0), జేకబ్‌ బేథెల్‌ (13), బ్రైడన్‌ కార్స్‌ (9), మాథ్యూ పాట్స్‌ (6) విఫలం కాగా.. ఆఖర్లో ఆదిల్‌ రషీద్‌ అత్యంత కీలకమైన ఇన్నింగ్స్‌ (25 బంతుల్లో 36; 4 ఫోర్లు) ఆడాడు. రషీద్‌ ఈ పరుగులు చేయకుండి ఉంటే ఇంగ్లండ్‌ 300 పరుగుల మార్కును తాకేది కాదు. ఆసీస్‌ బౌలర్లలో ట్రవిస్‌ హెడ్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. మ్యాక్స్‌వెల్‌, ఆరోన్‌ హార్డీ, ఆడమ్‌ జంపా తలో రెండో వికెట్లు దక్కించుకున్నారు.

రాణించిన షార్ట్‌
ఛేదనలో ఆస్ట్రేలియా ఆది నుంచి వేగంగా ఆడింది. తొలి 10 ఓవర్లలోనే ఆ జట్టు 100 పరుగుల మార్కును దాటింది. మాథ్యూ షార్ట్‌ మెరుపు హాఫ్‌ సెంచరీ (30 బంతుల్లో 58; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) చేయగా.. బంతితో మ్యాజిక్‌ చేసిన ట్రవిస్‌ హెడ్‌ ఓ మోస్తరు ఇన్నింగ్స్‌ (26 బంతుల్లో 31; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడాడు. మ్యాచ్‌ నిలిచిపోయే సమయానికి స్టీవ్‌ స్మిత్‌ (48 బంతుల్లో 36), జోష్‌ ఇంగ్లిస్‌ (20 బంతుల్లో 28) క్రీజ్‌లో ఉన్నారు. 

ఇంగ్లండ్‌ బౌలర్లలో మాథ్యూ పాట్స్‌, బ్రైడన్‌ కార్స్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో బంతితో రాణించి, సిరీస్‌ ఆధ్యాంతం బ్యాట్‌తో అలరించిన ట్రవిస్‌ హెడ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డులు లభించాయి. ఈ సిరీస్‌లోని తొలి రెండు వన్డేలు, ఐదో వన్డే ఆసీస్‌ గెలువగా.. ఇంగ్లండ్‌ మూడు, నాలుగు వన్డేల్లో విజయాలు సాధించింది.

చదవండి: భారత్‌తో టీ20 సిరీస్‌.. బంగ్లాదేశ్‌ జట్టు ప్రకటన

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)