Breaking News

డబ్ల్యూటీసీలో తొలి ప్లేయర్‌గా.. ట్రవిస్‌ హెడ్‌ అరుదైన రికార్డు

Published on Sat, 06/28/2025 - 16:31

ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ ట్రవిస్‌ హెడ్‌ (Travis Head) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (WTC)లో అత్యధిక ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డులు అందుకున్న క్రికెటర్‌గా నిలిచాడు. వెస్టిండీస్‌తో తొలి టెస్టు సందర్భంగా హెడ్‌ ఈ ఘనత సాధించాడు.

కాగా ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు ప్రస్తుతం వెస్టిండీస్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా తొలుత మూడు టెస్టులు.. అనంతరం ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం మొదలైన తొలి టెస్టు (WI vs AUS) మూడు రోజు ఆటలోనే ముగిసింది.

హెడ్‌ హాఫ్‌ సెంచరీలు
బార్బడోస్‌ వేదికగా టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌ చేసింది. అయితే, విండీస్‌ బౌలర్ల విజృంభణకు ఆసీస్‌ టాపార్డర్‌ కుదేలు అయింది. ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా (47) ఫర్యాలేదనిపించగా.. ఐదో స్థానంలో బరిలోకి దిగిన ట్రవిస్‌ హెడ్‌ అర్ధ శతకం (59)తో రాణించాడు. మిగతా వాళ్లలో కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ (28) కాసేపు పోరాటం చేశాడు.

ఈ క్రమంలో 56.5 ఓవర్లలోనే ఆసీస్‌ కథ ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఇందుకు బదులుగా విండీస్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 190 పరుగులు సాధించింది. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ పొరపాట్లను పునరావృతం చేయలేదు.

టాపార్డర్‌ మరోసారి విఫలమైనా.. ఈసారి హెడ్‌ (61)తో పాటు బ్యూ వెబ్‌స్టర్‌ (63), అలెక్స్‌ క్యారీ (65) కలిసి ఇన్నింగ్స్‌ నిలబెట్టారు. ఫలితంగా రెండో ఇన్నింగ్స్‌లో 310 పరుగులు చేసిన కంగారూలు.. ఆతిథ్య జట్టుకు 301 పరుగుల (విండీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 10 పరుగుల ఆధిక్యం) లక్ష్యం విధించారు.

ఆస్ట్రేలియా ఘన విజయం
ఈ క్రమంలో విండీస్‌ 141 పరుగులకే ఆలౌట్‌ కావడంతో.. 159 రన్స్‌తో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 59, రెండో ఇన్నింగ్స్‌లో 61 పరుగులతో రాణించి ఇక ఆసీస్‌ గెలుపులో కీలక పాత్ర పోషించిన ట్రవిస్‌ హెడ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. హెడ్‌ టెస్టు కెరీర్‌లో ఇది పదో అవార్డు.

తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (2019) మొదలుపెట్టిన తర్వాత అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా హెడ్‌ చరిత్రకెక్కాడు. ఇక ఓవరాల్‌గా టెస్టుల్లో సౌతాఫ్రికా దిగ్గజం జాక్వెస్‌ కలిస్‌ అత్యధికంగా 23సార్లు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్నాడు.

చదవండి: వ‌రుసగా ఐదు ఓట‌ములు.. కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్న స‌న్‌రైజ‌ర్స్ స్టార్‌

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)