Breaking News

న్యూజిలాండ్‌ సిరీస్‌కు ముందే 'మరోసారి' రంగంలోకి దిగనున్న విరాట్‌

Published on Mon, 12/29/2025 - 15:00

టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (Virat Kohli) న్యూజిలాండ్‌ సిరీస్‌కు ముందే మరోసారి రంగంలోకి దిగనున్నాడు. ఇటీవలే విజయ్‌ హజారే ట్రోఫీలో ఢిల్లీ తరఫున రెండు మ్యాచ్‌లు ఆడిన విరాట్‌, ఇదే టోర్నీలో మరో మ్యాచ్‌ ఆడేందుకు సిద్దంగా ఉన్నాడు. 

జనవరి 6న ఆలుర్‌లో రైల్వేస్‌తో జరుగబోయే మ్యాచ్‌లో విరాట్‌ బరిలో ఉంటాడని ఢిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌ అత్యున్నత అధికారి ఒకరు క్రిక్‌బజ్‌కు లీక్‌ ఇచ్చారు.  

ఈ మ్యాచ్‌ ముగిసిన వెంటనే విరాట్‌ న్యూజిలాండ్‌ వన్డే సిరీస్‌ కోసం జనవరి 7న భారత జట్టుతో పాటు బరోడాలో కలుస్తాడు. భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ కోసం భారత జట్టును అతి త్వరలో ప్రకటిస్తారు. 

ఈ జట్టులో విరాట్‌ ఉండటం లాంఛనమే. టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన విరాట్‌ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఈ ఫార్మాట్‌లో విరాట్‌ ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలు, 3 హాఫ్‌ సెంచరీలు చేసి పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్‌ హజారే ట్రోఫీలో రెండు మ్యాచ్‌లు ఆడిన విరాట్‌.. ఓ సెంచరీ (ఆంధ్రపై 131), ఓ హాఫ్‌ సెంచరీ (గుజరాత్‌పై 77) చేశాడు. 

విరాట్‌ రైల్వేస్‌తో జరుగబోయే మ్యాచ్‌లోనూ సత్తా చాటితే న్యూజిలాండ్‌ సిరీస్‌కు ముందు టీమిండియాకు అదనపు ధైర్యం వస్తుంది.

విరాట్‌ తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు (135, 102), ఓ హాఫ్‌ సెంచరీ (65 నాటౌట్‌) చేశాడు. అంతకుముందు ఆస్ట్రేలియా పర్యటనలో తొలి రెండు మ్యాచ్‌ల్లో డకౌటైన విరాట్‌.. చివరి మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ (74 నాటౌట్‌) చేసి ఫామ్‌లోకి వచ్చాడు. విరాట్‌ ఢిల్లీ జట్టులో ఉండటం వల్ల విజయ్‌ హజారే ట్రోఫీలో ఆ జట్టుకు కూడా అదనపు బలం చేకూరుతుంది.

చదవండి: మ‌హ్మద్ ష‌మీకి బీసీసీఐ భారీ షాక్‌..!

 

 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)