Breaking News

పొట్టి క్రికెట్‌లో అసాధారణ ఘటన.. చరిత్రలో తొలిసారి ఇలా..!

Published on Sat, 09/06/2025 - 10:43

పొట్టి క్రికెట్‌లో ఓ అసాధారణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఫార్మాట్‌ చరిత్రలో తొలిసారి ఓ బ్యాటర్‌ టైమ్డ్‌ ఔట్‌గా (Timed Out) ప్రకటించబడ్డాడు. కేరళ క్రికెట్‌ లీగ్‌-2025లో భాగంగా ఇది జరిగింది.

నిన్న (సెప్టెంబర్‌ 5) కాలికట్‌ గ్లోబ్‌స్టార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో (రెండో సెమీఫైనల్‌) కొచ్చి బ్లూ టైగర్స్‌ ఆటగాడు అల్ఫీ ఫ్రాన్సిస్‌ జాన్‌ టైమ్డ్‌ ఔట్‌ అయ్యాడు. నిబంధనల ప్రకారం​ ఓ ఆటగాడు ఔటయ్యాక 90 సెకెన్లలోపు మరో ఆటగాడు క్రీజ్‌లోకి రావాల్సి ఉంటుంది.

అయితే ఈ ఘటనలో అల్ఫీ నిర్దేశిత సమయాన్ని దాటాక క్రీజ్‌లోకి వచ్చాడు. ఇది గమనించిన కాలికట్‌ బౌలర్లు ఫీల్డ్‌ అంపైర్‌కు అప్పీల్‌ చేశారు. పలు మార్లు పరిశీలించిన అనంతరం అంపైర్‌ అల్ఫీని ఔట్‌గా ప్రకటించాడు. 

దీంతో అల్ఫీ ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే క్షణాల్లో తిరిగి పెవిలియన్‌కు చేరాడు. పొట్టి క్రికెట్‌ చరిత్రలో ఓ బ్యాటర్‌ టైమ్డ్‌ ఔట్‌ ద్వారా ఔట్‌ కావడం ఇదే మొదటిసారి.

ఇలాంటి ఘటన ఇటీవల ఓ అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లో చోటు చేసుకుంది. ఐసీసీ వరల్డ్‌ కప్‌-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్‌ టైమ్డ్‌ ఔటయ్యాడు. బంగ్లా ఆటగాడు షకీబ్‌ అల్‌ హసన్‌ అప్పీల్‌ మేరకు అంపైర్లు మాథ్యూస్‌ను టైమ్డ్‌ ఔట్‌గా ప్రకటించారు. 

ఈ ఉదంతం తర్వాత షకీబ్‌ విమర్శలు ఎదుర్కొన్నాడు. క్రీడాస్పూర్తిని మరిచి ప్రవర్తించాడని మాటలు పడ్డాడు. ఏది ఏమైనా నిబంధనల ప్రకారం మాథ్యూస్‌ టైమ్డ్‌ ఔట్‌ కరెక్టేనని మరికొందరు షకీబ్‌కు మద్దతుగా మాట్లాడారు.

క్రికెట్‌ చరిత్రలో టైమ్డ్‌ ఔట్‌ నిబంధన ఉల్లంఘించి ఇప్పటివరకు ఏడుగురు ఔటైనట్లు తెలుస్తుంది. తొలిసారి ఈ నిబంధన ఉల్లంఘణకు బలైన ఆటగాడు హెరాల్డ్‌ హేగేట్‌ (సర్రే). 1919 కౌంటీ సీజన్‌లో సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో హెరాల్డ్‌ నిర్దేశిత సమయంలోపు క్రీజ్‌లోకి రాలేదు. దీంతో అంపైర్లు అతన్ని ఔట్‌గా ప్రకటించారు.

ప్రస్తుతం టీ20 క్రికెట్‌ జరుగుతున్న తీరు ప్రకారం టైమ్డ్‌ ఔట్‌ అన్నది అసాధారణం. ఎందుకంటే, ఆటగాళ్లు క్రీజ్‌కు అతి సమీపంలో డగౌట్లలో ఉంటారు. ఓ ఆటగాడు ఔటయ్యాక మరో ఆటగాడు క్షణాల్లో క్రీజ్‌లో వాలిపోవచ్చు. అలాంటిది తాజా ఉదంతంలో అల్ఫీ 90 సెకెన్లు దాటినా క్రీజ్‌లోకి రాకపోవడమనేది అసాధారణమనే అని చెప్పాలి.

మ్యాచ్‌ విషయానికొస్తే.. అల్ఫీ టైమ్డ్‌ ఔట్‌ ఉదంతం తర్వాత కూడా తొలుత బ్యాటింగ్‌ చేసిన కొచ్చి జట్టు భారీ స్కోర్‌ చేసింది. నికిల్‌ (64 నాటౌట్‌) మెరుపు అర్ద సెంచరీతో, ఆఖర్లో ఆషిక్‌ (31) సుడిగాలి వేగంతో పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.

అనంతరం లక్ష్య ఛేదనలో కాలికట్‌ తడబడింది. నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి ఆ జట్టు లక్ష్యానికి 16 పరుగుల దూరంలో నిలిచిపోయింది. అఖిల్‌ స్కారియా (72 నాటౌట్‌) కాలికట్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. ఈ గెలుపుతో కొచ్చి టైగర్స్‌ ఫైనల్స్‌కు చేరింది. 

ఈ సీజన్‌లో కొచ్చి ఫైనల్స్‌కు చేరడంలో టీమిండియా ఆటగాడు సంజూ శాంసన్‌ కీలకపాత్ర పోషించాడు. ఆడిన ప్రతి మ్యాచ్‌లో ఇరగదీసి కొచ్చిని సెమీస్‌ వరకు తీసుకొచ్చాడు. ఆసియా కప్ కోసం  సంజూ దుబాయ్‌కు వెళ్లడంతో సెమీస్‌ ఆడలేదు.  

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)