Breaking News

హైదరాబాద్‌లో సందడి చేసిన ఆసియా కప్‌ ఫైనల్‌ హీరో

Published on Tue, 09/30/2025 - 13:19

సెప్టెంబర్‌ 28న పాకిస్తాన్‌తో జరిగిన ఆసియా కప్‌ 2025 ఫైనల్లో (Asia Cup 2025) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడి భారత్‌ను ఒంటిచేత్తో గెలిపించిన హైదరాబాదీ స్టార్‌ తిలక్‌ వర్మ (Tilak Varma).. ఇవాళ నగరంలో సందడి చేశాడు. తాను చిన్నతనంలో శిక్షణ పొందిన లేగాలా క్రికెట్‌ అకాడమీని (Legala Cricket Academy) సందర్శించాడు. 

తిలక్‌ను చూసేందుకు క్రికెట్‌ అభిమానులు ఎగబడ్డారు. తిలక్‌కు, అతని కోచ్‌ సలామ్‌ బయాష్‌కు అకాడమీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా తిలక్‌ మాట్లాడుతూ.. ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా గెలవడం చాలా సంతృప్తినిచ్చింది. ఆ మ్యాచ్‌లో టీమిండియాను గెలిపించడమే టార్గెట్‌గా పెట్టుకొని ఆడాను. ఆ సమయంలో మా కళ్ల ముందు దేశమే కనిపించింది. నేను ఆడిన ఇన్నింగ్స్‌లలో ఇదే అత్యుత్తమమైంది. 

ఫైనల్లో పాక్‌ ఆటగాళ్ల స్టెడ్జింగ్‌ మాపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. విరాట్‌ కోహ్లి నాకు ఎంతో స్పూర్తినిచ్చాడు. విరాట్‌ కోహ్లితో నన్ను పోల్చడం గర్వంగా ఉందని అన్నాడు.

కాగా, 23 ఏళ్ల తిలక్‌కు లెగాలా క్రికెట్ అకాడమీనే పునాది. లింగంపల్లి ప్రాంతంలో ఉన్న ఈ అకాడమీ తిలక్‌కు క్రికెట్‌లో తొలి పాఠాలు నేర్పింది. కోచ్ సలాం బయాష్‌ మార్గదర్శకత్వంలో తిలక్ 11 ఏళ్ల వయసులోనే ప్రతిభను చాటాడు. తిలక్‌ ఇంటి నుంచి అకాడమీకి రోజూ 40 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వచ్చేది.

హైదరాబాద్ లింగంపల్లిలో ఆసియా కప్ హీరో తిలక్ వర్మ సందడి

కోచ్ సలాం బయాష్‌ తిలక్‌ను స్వయంగా తన వాహనంలో తీసుకొచ్చి, తిరిగి ఇంటికి చేర్చేవాడు. 2020లో తిలక్‌ అండర్-19 వరల్డ్‌కప్‌కు ఎంపిక కావడంలో అకాడమీ పాత్ర చాలా కీలకం. తిలక్ టీమిండియాకు ఎంపికయ్యే వరకు వారానికి నాలుగు రోజుల పాటు అకాడమీకి వెళ్లేవాడు. ఆసియా కప్‌ హీరోయిక్స్‌ తర్వాత తిలక్‌ హైదారాబాద్‌ యువతకు స్పూర్తిగా మారాడు. 

చదవండి: టీమిండియాకు బ్యాడ్‌ న్యూస్‌

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)