Breaking News

టీమిండియాతో జాయిన్ అవనున్న‌ వైభ‌వ్, తిలక్‌ వర్మ

Published on Wed, 06/17/2026 - 08:16

గత కొన్ని రోజులుగా త‌న ఆట‌తీరుతో హాట్‌టాపిక్‌గా మారిపోయిన వైభ‌వ్ సూర్య‌వంశీ లంక ఆట‌గాళ్ల‌తో గొడ‌వ వ‌ల్ల మ‌రోసారి వార్త‌ల్లో నిలిచాడు. ఇండియా-ఏ జ‌ట్టు త‌ర‌ఫున ట్రై సిరీస్ ఆడేందుకు లంక ప‌ర్య‌ట‌నకు వ‌చ్చిన వైభ‌వ్ సూర్య‌వంశీ టీమిండియాతో జాయిన్ అవ్వ‌నున్నాడు. 

వైభ‌వ్ సూర్య‌వంశీతో పాటు యువ జ‌ట్టుకు సార‌థ్యం వ‌హిస్తున్న తిల‌క్ వ‌ర్మ కూడా జూన్ 22న చెన్నైలో భార‌త సీనియ‌ర్ జట్టుతో క‌ల‌వ‌నున్నాడు. చెన్నై నుంచి భార‌త జ‌ట్టు ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడేందుకు బెల్‌ఫాస్ట్‌కు బ‌యల్దేరి వెళ్ల‌నుంది. జూన్ 21న ట్రై సిరీస్ ఫైన‌ల్ జ‌ర‌గ‌నుంది. 

ఒక‌వేళ ఇండియా-ఏ జ‌ట్టు ఫైనల్ చేరితే ఆ సిరీస్ ఫైన‌ల్ మ్యాచ్ ముగిసిన త‌ర్వాత వైభ‌వ్‌, తిల‌క్‌లు నేరుగా చెన్నైకి వ‌చ్చి జ‌ట్టుతో క‌ల‌వ‌నున్నారు. ఒక‌వేళ ఇవాళ ఆఫ్గ‌న్‌తో మ్యాచ్‌లో ఓడితే మాత్రం ఇండియా-ఏ జ‌ట్టు ఇంటిబాట ప‌ట్ట‌నుంది. ఐపీఎల్‌లో సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న‌తో 15 ఏళ్ల వయసులోనే టీమిండియాకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డులకెక్కాడు. రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. 

ఈ ప్రదర్శనకు మెచ్చిన బీసీసీఐ సెలెక్టర్లు వైభవ్‌ను ఐర్లాండ్‌, ఇంగ్లండ్ టూర్లతో పాటు ఆసియా గేమ్స్‌కు ప్రకటించిన టీమిండియా జట్టుకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఐర్లాండ్‌ పర్యటనలో టీమిండియా తొలి టీ20 మ్యాచ్‌ను జూన్‌ 26న ఆడనుంది. ఇక బీసీసీఐ టీమిండియా టీ20 కొత్త కెప్టెన్‌గా సూర్యకుమార్‌ స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌ను నియమించింది.

చదవండి: ఆఫ్గన్‌-ఏతో కీలక మ్యాచ్‌.. నిలకడగా ఆడుతున్న వైభవ్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)