Breaking News

టీమిండియాకు గుడ్ న్యూస్‌.. డేంజరస్‌ బ్యాటర్‌ వచ్చేస్తున్నాడు!

Published on Fri, 01/30/2026 - 16:00

టీ20 ప్రపంచకప్‌-2026కు టీమిండియాకు గుడ్ న్యూస్‌. గాయం కారణంగా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు దూరమైన స్టార్ బ్యాటర్‌, హైదరాబాదీ తిలక్ వర్మ.. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది. అబ్డోమినల్ సర్జరీ తర్వాత తిలక్‌ బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో శిక్షణ పొం‍దుతున్నాడు.

అయితే  శుక్రవారం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరిగే సిమ్యులేషన్ మ్యాచ్‌లో తిలక్ పాల్గోనున్నాడు. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటే బోర్డు నుంచి క్లియరెన్స్ లభిస్తుంది. ఒకవేళ బోర్డు నుంచి క్లియరెన్స్ లభిస్తే తిలక్‌.. ఫిబ్రవరి 3న భారత జట్టుతో కలిసే అవకాశముందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

కాగా తొలుత న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20 సిరీస్‌లో ఆఖరి రెండు మ్యాచ్‌లకు తిలక్ అందుబాటులో ఉంటాడని వార్తలు వచ్చాయి. కానీ పూర్తిగా కోలుకుండా అతడి ఆడించి రిస్స్ తీసుకోడదని బీసీసీఐ భావించింది. ఈ క్రమంలోనే తిలక్ స్ధానంలో జట్టులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్‌ను ఆఖరి రెండు టీ20లకూ కొనసాగించారు. తిలక్ తిరిగి రీఎంట్రీ ఇస్తే  జట్టు మిడిల్ ఆర్డర్ మరింత బలోపేతం కానుంది.
 
మయాంక్ ఫిట్‌..
మరోవైపు వెన్నునొప్పి కారణంగా దాదాపు ఏడాది కాలంగా ఆటకు దూరంగా ఉన్న ఢిల్లీ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ కూడా పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. వరల్డ్ కప్ సన్నాహకాల్లో భాగంగా జరిగే వార్మప్ మ్యాచ్‌లలో ఇండియా-ఎ తరపున మయాంక్ బరిలోకి దిగనున్నాడు. అదేవిధంగా కుడి భుజం గాయం నుంచి కోలుకున్న అస్సాం ఆటగాడు రియాన్‌ పరాగ్ యో-యో టెస్టు పాస్ అయ్యాడు.

అతడు కూడా తిలక్‌తో కలిసి సిమ్యులేషన్ మ్యాచ్‌లో భాగం కానున్నాడు. ఇక కివీస్‌తో వన్డే సిరీస్‌లో గాయపడిన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ పూర్తిగా కోలుకోవడానికి కాస్త సమయం పడుతోంది. అతడికి ఫిబ్రవరి 4న ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించనున్నారు. టీ20 వరల్డ్‌కప్ లీగ్ మ్యాచ్‌లకు వాషీ దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
చదవండి: వ‌ర‌ల్డ్‌క‌ప్ నుంచి సౌతాఫ్రికా అవుట్‌

Videos

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)