Breaking News

తనయ్‌ విజృంభణ.. ఆంధ్రపై హైదరాబాద్ ఘన విజయం

Published on Thu, 10/22/2026 - 06:52

రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు ఆంధ్రపై 267 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. తనయ్ త్యాగరాజన్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 11 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన తనయ్, రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో ఆంధ్ర పతనాన్ని శాసించాడు. 398 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర 130 పరుగులకే కుప్పకూలింది. తనయ్ రెండో ఇన్నింగ్స్‌లో అర్ధశతకం కూడా సాధించాడు.

మిగతా మ్యాచ్‌ విషయానికొస్తే..  కేరళ జట్టు ఒడిశాపై ఇన్నింగ్స్‌ 36 పరుగుల తేడాతో గెలిచింది. జలజ్ సక్సేనా ఐదు వికెట్లతో సత్తాచాటాడు. ముంబై జట్టు హిమాచల్ ప్రదేశ్‌పై ఇన్నింగ్స్‌ 97 పరుగుల తేడాతో విజయం సాధించింది. పంజాబ్ ఏడు వికెట్ల తేడాతో ఛత్తీస్‌గఢ్‌ను ఓడించింది. మేఘాలయ మూడు పరుగుల తేడాతో మణిపూర్‌పై ఉత్కంఠ విజయం సాధించింది.

మహారాష్ట్ర-జార్ఖండ్, ఢిల్లీ-గుజరాత్, రైల్వేస్-రాజస్థాన్, కర్ణాటక-సౌరాష్ట్ర మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో మహారాష్ట్ర, ఢిల్లీ, సౌరాష్ట్ర పైచేయి సాధించాయి. మిజోరం నిర్దేశించిన 581/9 స్కోరుకు బదులుగా నాగాలాండ్ 516 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌లో వెనుకబడింది. మిజోరం బ్యాటర్ చిన్మయ్ సుతార్ 400 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఇదీ చదవండి: ముంబై డబుల్‌ బోనస్‌


 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)