Breaking News

వరుసగా మూడో మ్యాచ్‌లోనూ సెంచరీ చేసిన టీమిండియా యువ సంచలనం

Published on Tue, 07/08/2025 - 09:17

టీమిండియా యువ సంచనలం ముషీర్‌ ఖాన్‌ ఇంగ్లండ్‌ పర్యటనలో పట్టపగ్గాల్లేకుండా చెలరేగిపోతున్నాడు. వరుస సెంచరీలు, ఐదు వికెట్ల ప్రదర్శనలతో దుమ్మురేపుతున్నాడు. ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ ఎమర్జింగ్‌ టీమ్‌ (MCA Colts) తరఫున ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న ముషీర్‌ ఆల్‌రౌండర్‌గా అదరగొడుతున్నాడు.

ఈ పర్యటనలో Notts 2nd XIతో జరిగిన తొలి  మ్యాచ్‌లో 127 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 123 పరుగులు చేసిన ముషీర్‌.. ఆ మ్యాచ్‌లో బౌలింగ్‌లోనూ ఇరగదీసి 6 వికెట్లు ప్రదర్శన నమోదు చేశాడు.

అనంతరం జులై 3న ఛాలెంజర్స్‌తో (కంబైన్డ్‌ నేషనల్‌ కౌంటీస్‌) ప్రారంభమైన రెండో మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ (127 బంతుల్లో 125; 11 ఫోర్లు, సిక్స్‌) చేసిన ముషీర్‌.. బౌలింగ్‌లోనూ చెలరేగి ఆ మ్యాచ్‌ మొత్తంలో పది వికెట్లు (తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 4) తీశాడు.

తాజాగా ముషీర్‌ లౌబరో UCCE జట్టుతో జరిగిన మ్యాచ్‌లో మరోసారి సెంచరీతో కదంతొక్కాడు. ఈ మ్యాచ్‌లో ముషీర్‌ 146 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 154 పరుగులు చేసి రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. ముషీర్‌కు ఇంగ్లండ్‌ పర్యటనలో ఇది వరుసగా మూడో సెంచరీ.

హ్యాట్రిక్‌ సెంచరీలు, అదిరిపోయే బౌలింగ్‌ ప్రదర్శనలతో ఇంగ్లండ్‌ పర్యటనలో దుమ్మురేపుతున్న ముషీర్‌పై ప్రశంసల వర్షం కురుస్తుంది. భారత క్రికెట్‌కు మరో  భవిష్యత్‌ తార దొరికాడని టీమిండియా అభిమానులు సంబురపడిపోతున్నారు. 20 ఏళ్ల ముషీర్‌ గతేడాది సెప్టెంబర్‌లో కారు ప్రమాదానికి గురైన తర్వాత ఆడుతున్న తొలి రెడ్‌ బాల్‌ టోర్నీ ఇది.

ఈ టోర్నీలో ముషీర్‌ ఆకాశమే హద్దుగా చెలరేగుతూ భారత సీనియర్‌ టీమ్‌ సెలెక్టర్లకు సవాలు విసురుతున్నాడు. ఇప్పటికే భారత జట్టులో చోటు కోసం తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. ముషీర్‌ అన్న సర్ఫరాజ్‌ ఖాన్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నా టీమిండియా బెర్త్‌ దక్కడం లేదు. 

మరోవైపు కౌంటీల్లో సత్తా చాటుతూ ఇషాన్‌ కిషన్‌, తిలక్‌ వర్మ కూడా భారత టెస్ట్‌ జట్టు బెర్త్‌ వైపు చూస్తున్నారు. ఇంత పోటీలో ముషీర్‌ టీమిండియా వైపు ఎలా వస్తాడో చూడాలి. ఇక్కడ ముషీర్‌కు ఓ అడ్వాంటేజ్‌ ఉంది. ముషీర్‌ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ ఇరగదీస్తున్నాడు. లెఫ్ట్‌ ఆర్మ్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ అయిన ముషీర్‌.. ఇంగ్లండ్‌ పర్యటనకు ముందు కూడా సత్తా చాటాడు.

ముషీర్‌కు దేశవాలీ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. 2022-23 రంజీ సీజన్‌లో ముంబై తరఫున అరంగేట్రం చేసిన ముషీర్‌.. ఆడిన 9 మ్యాచ్‌ల్లో 51.14 సగటున 3 సెంచరీలు, ఓ హాఫ్‌ సెంచరీ సాయంతో 716 పరుగులు చేశాడు. ఇందులో ఓ అజేయ డబుల్‌ సెంచరీ కూడా ఉంది.

ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో ముషీర్‌ బౌలర్‌గానూ రాణించాడు. 9 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీశాడు. ముషీర్‌ 2024 అండర్‌-19 వరల్డ్‌కప్‌లో భారత జట్టు సభ్యుడిగా ఉన్నాడు. టీమిండియా రన్నరప్‌గా నిలిచిన ఈ టోర్నీలో ముషీర్‌ రెండు సెంచరీలు చేశాడు. 2024 రంజీ ఫైనల్లో సెంచరీ చేసిన ముషీర్‌.. ముంబై తరఫున రంజీ ఫైనల్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును బద్దలు కొట్టాడు.

 

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)