Breaking News

కోహ్లి కంటే సన్నగా!.. కింగ్‌ను ఉక్కిరిబిక్కిరి చేసిన ఫ్యాన్స్‌!

Published on Wed, 01/07/2026 - 21:29

టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లతో బిజీ కానుంది. కివీస్‌తో తొలుత మూడు వన్డేలు.. అనంతరం ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే భారత్‌, న్యూజిలాండ్‌ తమ జట్లను ప్రకటించాయి.

ఇక జనవరి 11, 14, 18 తేదీల్లో భారత్‌-కివీస్‌ మధ్య జరిగే వన్డే సిరీస్‌కు హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) సన్నద్ధమవుతున్నాడు. నెట్స్‌లో తీవ్రంగా చెమటోడుస్తూ శ్రమిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

కోహ్లి కంటే కూడా సన్నబడ్డాడే!
కాగా ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో టీమిండియాను విజేతగా నిలిపిన తర్వాత.. టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించిన రోహిత్‌.. ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏకంగా పది కిలోలకు పైగా బరువు తగ్గి ఆశ్చర్యపరిచాడు. తాజా వీడియోలో రోహిత్‌ మరింత బక్కచిక్కినట్లు కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో అభిమానులు.. ‘‘బ్రో.. కోహ్లి కంటే కూడా సన్నబడ్డాడే! అస్సలు గుర్తుపట్టలేకపోతున్నాం. సూపర్‌ భాయ్‌’’ అంటూ రోహిత్‌ శర్మను ఉద్దేశించి సరదాగా కామెంట్లు చేస్తున్నారు. 

 కింగ్‌ను ఉక్కిరిబిక్కిరి చేసిన ఫ్యాన్స్‌!
మరోవైపు.. దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (Virat Kohli) కివీస్‌తో తొలి వన్డే కోసం వడోదరలో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో కోహ్లికి చేదు అనుభవం ఎదురైంది. కింగ్‌ను చూసేందుకు ఎగబడ్డ జనం.. అతడికి తీవ్ర అసౌకర్యం కలిగించారు. అతికష్టమ్మీద అతడు ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వెళ్లాడు.

ఇద్దరూ సూపర్‌ ఫామ్‌లో
ఇటీవల సౌతాఫ్రికాతో సొంతగడ్డపై వన్డే సిరీస్‌లో బ్యాటింగ్‌ దిగ్గజాలు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ అదరగొట్టారు. కోహ్లి అయితే వరుస సెంచరీలతో వింటేజ్‌ కింగ్‌ను గుర్తు చేశాడు.

ఆ తర్వాత రో-కో దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26లో సొంత జట్ల తరఫున బరిలోకి దిగారు. ముంబై తరఫున రోహిత్‌, ఢిల్లీ తరఫున కోహ్లి శతక్కొట్టారు. ఇలా స్టార్లు ఇద్దరూ సూపర్‌ ఫామ్‌లో ఉండటం కివీస్‌తో వన్డేలకు ముందు టీమిండియాకు సానుకూలాంశంగా పరిణమించింది.

చదవండి: IND vs NZ: టీమిండియాకు శుభవార్త

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌